Viral: ఓనర్ నుంచి కుర్రాడికి ఊహించని మెసేజ్..నన్ను కన్నకొడుకులా చూస్తుంది.. ఇప్పుడేం చేయాలంటూ..
ABN , Publish Date - Feb 18 , 2024 | 04:17 PM
తన ఉంటున్న ఇంటి ఓనర్ చేసిన అభ్యర్థన ఓ ఎంబీబీఎస్ విద్యార్థికి ఊహించని షాకిచ్చింది. ఏం చేయాలో అర్థంకాక అతడు చివరకు ట్విట్టర్లో తన సమస్య పంచుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: విద్యార్థులు.. ముఖ్యంగా కుటుంబానికి దూరంగా ఉండి చదువుకునేవారి కష్టాలు అన్నీఇన్నీ కావు. చదువుల ఒత్తిళ్లు, కుటుంబానికి దూరంగా కొత్త వ్యక్తులతో కలిసి ఉండటం, అద్దెఇళ్లల్లో ఇంటి ఓనర్లు పెట్టే తిప్పలు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే అవుతుంది. ఇది చాలదన్నట్టు కొన్ని పరిస్థితులు వాళ్లను మరింత తికమకపెట్టేస్తుంటాయి. ఢిల్లీలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థికి (MBBS student) సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తన సమస్యకు పరిష్కారం చెప్పాలంటూ అతడు నెటిజన్లకు చేసిన అభ్యర్థన ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
మినరల్ వాటర్ తాగుతారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
సచిన్ అనే ఎంబీబీఎస్ స్టూడెంట్ తనకెదురైన వింత పరిస్థితిని ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. సచిన్ చెప్పిన వివరాల ప్రకారం, అతడు ఢిల్లీలోని ఓ త్రీబెడ్ రూం ఫ్లాట్‌లో మరో ఇద్దరు ఫ్రెండ్స్‌తో అద్దెకు ఉంటున్నారు. అతడి ఇంటి యజమానురాలికి (Landlady) ఓ కూతురు ఉంది. ఆమె ప్రస్తుతం నీట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతోంది. అయితే, ఆమె చదువులో కాస్త వెనకబడి ఉంది. ఫిజిక్స్ సబ్జెక్టు ఆమెకు ఓ పట్టాన కొరుకున పడట్లేదు.
Viral: ఈ తండ్రి కష్టం చూస్తే కన్నీళ్లాగవు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇది!
ఈ క్రమంలోె ఓ రోజు ఇంటి ఓనర్.. సచిన్ ముందు ఓ వింత అభ్యర్థన పెట్టింది. తన కూతురు చదువులో వీక్ కాబట్టి.. సచిన్ చదువుతున్న కాలేజీలోనే ప్రైవేటుగా అడ్మిషన్ తీసుకుంటుందని చెప్పింది. అంతేకాకుండా, అతడు ఉంటున్న ఫ్లాట్‌లో మరో గదిలో ఉండేందుకు అనుమతించాలని అభ్యర్థించింది. ఓనర్ నుంచి ఇలాంటి వినతి వస్తుందని ఊహించని సచిన్ సలహా కోసం ట్విట్టర్‌ను ఆశ్రయించాడు. ఇంటి ఓనర్‌కు తనపై కన్నకొడుకు కంటే ఎక్కువ నమ్మకమని కూడా చెప్పాడు. ఆమె కూతురు కూడా తన ఫ్లాట్‌లోనే ఉంటుంది కాబట్టి రెంట్ తగ్గించమని అడగొచ్చా అని ప్రశ్నించాడు (MBBS student gets unusual request from landlady asks the internet for help).
Viral: రాత్రంతా కారు కిటికీ తెరిచే ఉంచాడు.. మరుసటి రోజు కారులో ఏసీ ఆన్ చేస్తే భారీ షాక్!
ఈ ట్వీట్‌పై నెట్టింట పెద్ద చర్చే మొదలైంది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చాలా మంది సలహా ఇచ్చారు. ఇంటి ఓనర్ కూతురి వల్ల అతడు తన ప్రైవెసీ కోల్పోతాడని హెచ్చరించారు. చదువులో వీక్‌గా ఉన్న ఓనర్ కూతురికి అసలు ఎంబీబీఎస్‌లోనే చేరొద్దని సలహా ఇవ్వాలని కొందరు అభిప్రాయపడ్డారు. ఆమె జీవితంలో ఇంతకు మించిన గొప్ప సూచన ఉండదని చెప్పుకొచ్చారు. కొందరు మాత్రం సచిన్‌ను ముందడుగు వేయమని ధైర్యం చెప్పారు. రెంట్ తగ్గించమనడంలో తప్పేమీ లేదని భరోసా ఇచ్చారు. ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులతో పాటూ తల్లిదండ్రులూ అసాధారణ ఒత్తిడులు ఎదుర్కొంటున్నారని మరికొందరు వాపోయారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి