Share News

Jayanti Gupta: ధోనీ సరే.. అతడి సోదరి గొప్పదనం గురించి తెలిస్తే..

ABN , Publish Date - Sep 19 , 2024 | 09:43 PM

ధోనీ కెరీర్‌లో అతడి సోదరిదీ కీలక పాత్రే. ధోనీ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే క్రమంలో తమ తండ్రిని ఒప్పించిందీ ఆమె సోదరేనని చెబుతారు.

Jayanti Gupta: ధోనీ సరే.. అతడి సోదరి గొప్పదనం గురించి తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: లైఫ్‌లో తోబుట్టువుల ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కొన్ని సందర్భాల్లో తోడబుట్టిన వారే క్లిష్టసమయాల్లో అండగా, ఆలంబనగా నిలుస్తారు. అలాంటి వాళ్లు జీవితంలో ఉండటం నిజంగా అదృష్టమే. భారత మేటి క్రికెటర్ ఎమ్ఎస్ ధోనీ అలాంటి అదృష్టవంతుడని చెప్పకతప్పదు. తొలి రోజుల్లో ధోనీ కెరీర్‌కు బాటలు వేసిన వ్యక్తుల్లో అతడి సోదరి జయంతీ గుప్తా కూడా ఒకరు. ధోనీ ప్రాణస్నేహితుడినే ఆమె పెళ్లాడటం మరో ఆసక్తికర అంశం (Viral).

Viral: భారతీయులు రోజుకు రూ.600 పొదుపు చేయాలన్న బిలియనీర్‌పై ఘాటు విమర్శలు!


ధోనీ అక్క పేరు జయంతీ గుప్తా. ధోనీ ఇతర కుటుంబ సభ్యుల్లాగే ఆమె కూడా మీడియా, ప్రచారానికి దూరంగా ఉంటారు. క్రికెట్‌పై ధోనీకి ఉన్న మక్కువ గుర్తించిన వ్యక్తుల్లో ఆమె కూడా ఒకరు. ధోనీ క్రికెట్‌‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు సిద్ధమైన సందర్భంలో జయంతి తమ తండ్రిని ఒప్పించి అతడికి మార్గం సుగమం చేశారు. రాంచీలోనే ఉండే జయంతి గుప్తా ఓ టీచర్. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఇంగ్లిష్ బోధిస్తుంటారు. ధోనీకి ప్రాణ స్నేహితుడైన గౌతమ్ గుప్తాను ఆమె వివాహమాడారు.

Viral: ఈ రక్తం ధర లీటరుకు రూ.12 లక్షలు! ఇంత ఖరీదు ఎందుకో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Sep 19 , 2024 | 09:50 PM