Million Dollar Moon: వావ్.. మిలియన్ డాలర్ మూన్.. ఈ ఫోటోగ్రాఫర్ శ్రమకు నాసా కుడా ఫిదా.. ఇందులో స్పెషలేంటంటే..!
ABN , Publish Date - Jan 12 , 2024 | 01:46 PM
ఈ ఫోటో కోసం అతను ఎన్నేళ్లు కష్టపడ్డాడో తెలిస్తే అవాక్కవుతారు.
ఫోటోలు మధురమైన జ్ఞాపకాలుగా పిలవబడతాయి. ఫోటోగ్రాఫర్ అంటే ప్రకృతి సాధారణ వ్యక్తి గమనించలేని విషయాలను తన కెమెరా ద్వారా ప్రపంచానికి పరిచయం చేసేవాడని అంటారు. విభిన్న ఆలోచనలు ఫోటోగ్రాఫర్ల సొంతం. కొందరు తమలో ఉన్న కళతో అంత సులువుగా తృప్తి చెందరు. ఇంకా ఏదో కొత్తగా చెయ్యాలని అనుకుంటూ ఉంటారు. ఇటలీకి చెందిన వలేరియో అనే ఫోటోగ్రాఫర్ కూడా ఇదే కోవకు చెందినవాడు. చంద్రుడికి సంబంధించి అద్భుతమైన ఫోటో తీయడానికి ఇతను పడిన కష్టానికి ఫలితం దక్కింది. ఈ ఫోటో గురించి ఇతని కష్టం గురించి పూర్తీగా తెలుసుకుంటే..
ఇటలీ(Italy)లోని టూరిన్ నగరంలో వలేరియా మినాటో అనే ఫోటోగ్రాఫర్ అద్బుతమైన చిత్రాన్ని తన కెమెరాలో బంధించాడు. 2012లో ఇతను ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తాడు. అప్పటి నుండి ఫోటోలు తీయడంలో తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ వస్తున్నాడు. చంద్రుడి(Moon)కి సంబంధించి అరుదైన ఫోటోలు తీయాలని ఇతని కోరిక. దీనికోసం ఏళ్లకేళ్లుగా కొండలు, గుట్టలు, భవంతులు, చెట్ల పొదలు మధ్య తిరుగుతూ అరుదైన సందర్భం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇలా కాలం గడుస్తూనే ఉంది. ఈ సమయంలో అతను చంద్రుడి గమనాన్ని, అన్ని దశలను స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. చివరికి టురిన్ నగరంలో చంద్రుని ఫోటో తీయడానికి నిర్ణయించుకున్నాడు. అయితే తను అనుకున్నట్టు చంద్రుని ఫోటో తీయడానికి అతను 6ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. 2023, డిసెంబర్ 15వ తేదీన ఇటలీలోని టూరెన్ నగరంలో చంద్రుని అరుదైన దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు.
ఇది కూడా చదవండి: రహదారి మీద ఇలా టీమిండియా స్టార్ ఆటగాడు.. ఇతడు ఎవరో గుర్తు పట్టారా..
ఈ ఫోటోలో మొదట ఒక భవంతి కనిపిస్తుంది. ఆ భవంతి వెనుక ఒక కొండ ఉంది. కొండ వెనుక నిండు చంద్రుడు ఉంటాడు. అయితే కొండ అడ్డంగా ఉన్న కారణంగా చంద్రుడు చీలిపోయి రెండు చిన్న ముక్కలుగా కనిపిస్తున్నాడు. ఈ ఫోటో ఈ దశాబ్దం గొప్పగా చెప్పుకోదగిన ఫోటో అని అంటున్నారు. ఈ ఫోటో చూసిన నాసా కూడా ఈ ఫోటోగ్రాఫర్ నైపుణ్యానికి ఫిదా అయ్యింది. ఈ ఫోటో తీస్తున్నప్పుడు వివిధ దిశలు మార్చుకుంటున్న క్లిప్, ఫైనల్ ఫోటో తీసిన దృశ్యానికి సంబంధించిన వీడియో valeriominato తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: అశ్వగంధ పొడిని పాలల్లో కలిపి తాగితే ఇన్ని అద్భుతాలా?
మరిన్ని వైరల్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.