Viral: ఇందుకేగా పిల్లల జీవితాలు నాశనమయ్యేది! తండ్రి అయ్యుండీ ఇలా చేయొచ్చా?
ABN , Publish Date - Oct 24 , 2024 | 03:05 PM
మైనర్ బాలిక స్కూటీ నడుపుతుంటే తండ్రి వెనక సీటుపై కూర్చున్న ఓ షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చిన్నారి జీవితాన్ని రిస్క్‌లో పడేసిన ఆ తండ్రిని వెంటనే అరెస్టు చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తల్లిదండ్రులన్నాక పిల్లల కళ్లల్లో ఆనందం చూడాలనుకుంటారు. కన్నబిడ్డల కోసం కొండమీద కోతిని తెచ్చేందుకు కూడా రెడీ అంటారు. అందులో తప్పు కూడా లేదు. కానీ తల్లిదండ్రులకు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. పిల్లలకు మంచీ చెడుల విచక్షణ నేర్పించాలి. బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చూడాలి. పిల్లలు సరదా పడుతున్నారంటూ బుద్ధికి తోచింది చేస్తే చివరకు పిల్లల జీవితాలతో పాటు ఇతరుల జీవితాలు తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఓ తండ్రి నిర్వాకం చూసి జనాలు సరిగ్గా ఇవే విమర్శలు చేస్తున్నారు. ఆ వ్యక్తిని తక్షణం అరెస్టు చేయాలంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు (viral).
Viral: ఉద్యోగులే మా సెలబ్రిటీలన్న కంపెనీ! ఎలాంటి దీపావళి గిఫ్ట్ ఇచ్చిందంటే..
ఇంతకీ అతడేం చేశాడంటే.. పట్టుమని 13 ఏళ్లు కూడా లేనట్టు కనిపిస్తున్న తన కూతురికి స్కూటీ ఇచ్చి ట్రాఫిక్‌లో డ్రైవ్ చేయించాడు. ఆయన వెనక సీటుపై ప్యాసెంజర్ లాగా కూర్చున్నాడు. చిన్నారి ఏమో స్కూలు యూనిఫాంలో ఉంది. తండ్రీకూతుళ్లిద్దరికీ హెల్మెట్ లేదు. మైనర్‌కు వాహనం ఇవ్వడం, అందూలోనూ రద్దీగా ఉన్న రోడ్డుపై నడపమని ప్రోత్సహించడాన్ని చూసి జనాలు తట్టుకోలేకపోయారు. దీంతో, ఈ వీడియోపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి.
Viral: బాయ్‌ఫ్రెండ్‌కు కోట్ల ఆస్తి వారసత్వంగా రానుందని తెలిసి హత్య! చివరకు..
ఏకంగా 4.9 మిలియన్ల వ్యూస్ వచ్చిన ఈ వీడియో చూసి నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. విమర్శల వరద పారించారు. ఓ తండ్రిగా బిడ్డకు రక్షణగా ఉండాల్సిన వ్యక్తి ఆమె లైఫ్‌ను ఇలా రిస్క్‌లో పడేయొచ్చా? అని కొందరు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తండ్రీకూళుళ్లిద్దరికీ హెల్మెట్ లేదు, ఇంతటి బాధ్యతారాహిత్యం సబబేనా? అని మరో వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. చిన్నారిని బండి నడపమని చెప్పి తను వెనక కూర్చోవడానికి మించిన దారుణం మరొకటటి లేదని కొందరు మండిపడ్డారు. చిన్నారి ప్రాణాలతో పాటు రోడ్డుమీద వచ్చేపోయే వారి జీవితాల్ని కూడా రిస్క్‌లో పడేశాడని తిట్టిపోశారు. ఇలా చేస్తేనే పిల్లల జీవితాలు నాశనం అవుతాయని, బాలిక తండ్రిని వెంటనే అరెస్టు చేయాలని కూడా కొందరు డిమాండ్ చేశారు.
Viral: ఎడారిలో చిక్కుకుపోయిన యువతులకు వింత అనుభవం! ఉబెర్ యాప్‌లో ఒంటెల సవారీ!
అయితే, మరి కొందరు మాత్రం వీడియోలోని వ్యక్తికి అండగా నిలిచే ప్రయత్నం చేశారు. కూతురు సరదా పడితే హ్యాండిల్ పట్టుకునేందుకు తండ్రి అంగీకరించి ఉంటాడని, అంతమాత్రికే ఇంత రాద్ధాంతం చేయడం సబబేనా? అని కొందరు అన్నారు. అరెస్టులు చేయాలని డిమాండ్ చేయడం, ఆ తండ్రిని తెగ తిట్టిపోయడం భావ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.