Viral: గాళ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌కు వెళ్లేందుకు పెయిడ్ లీవ్.. థాయ్ కంపెనీ వినూత్న ఆలోచన.. కారణమేంటంటే..
ABN , Publish Date - Sep 07 , 2024 | 01:52 PM
ప్రస్తుత బిజీ బిజీ లైఫ్‌లో ఉద్యోగులు ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొంటున్నారు. రోజులో అత్యధిక సమయం ఆఫీస్‌లోనే గడుపుతున్నా ఉత్పాదకత మాత్రం పెరగడం లేదు. దీంతో కొన్ని కంపెనీలు రకరకాల ప్రోత్సాహకాలతో ఉద్యోగులను రీఛార్జ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ప్రస్తుత బిజీ బిజీ లైఫ్‌లో ఉద్యోగులు (Employess) ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొంటున్నారు. రోజులో అత్యధిక సమయం ఆఫీస్‌లోనే (Office) గడుపుతున్నా ఉత్పాదకత మాత్రం పెరగడం లేదు. దీంతో కొన్ని కంపెనీలు రకరకాల ప్రోత్సాహకాలతో ఉద్యోగులను రీఛార్జ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఓ థాయ్‌లాండ్ కంపెనీ (Thailand Company) ``టిండర్ లీవ్`` (Tinder Leave) పేరుతో తన ఉద్యోగులకు పెయిడ్ లీవ్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ వల్ల ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుందని ఆ కంపెనీ యాజమాన్యం భావిస్తోంది (Viral News).
థాయ్‌లాండ్‌కి చెందిన మార్కెటింగ్ ఏజెన్సీ వైట్‌లైన్ గ్రూప్ తమ ఉద్యోగులకు ``టిండర్ లీవ్``ను ప్రకటించింది. గర్ల్‌ఫ్రెండ్‌తో డేట్‌కి వెళ్లేందుకు ఉద్యోగులకు జీతంతో కూడిన సెలవులను ఇస్తున్నట్టు తెలిపింది. ఉద్యోగులు ఈ సెలవులను జూలై నుంచి డిసెంబర్ మధ్య ఏ సమయంలోనైనా వాడుకోవచ్చునని సదరు కంపెనీ పేర్కొంది. అయితే ఈ సెలవులు ఎన్ని రోజులు ఉంటాయనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇలా టిండర్ లీవ్‌లు పెట్టాలనుకునే వారు వారం ముందు సమాచారం ఇవ్వాలట. ఈ వినూత్న నిర్ణయంతో ఉద్యోగులు తమ పనిలో మరింత మెరుగ్గా రాణిస్తారని యాజమాన్యం నమ్మకంతో ఉంది.
ఉద్యోగులలో ఆనందాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, నచ్చిన వ్యక్తితో ఏకాంతంగా గడపడం వల్ల ఉద్యోగులలో సంతోషం పెరుగుతుందని, ఉత్పాదకత కూడా పెరుగుతుందని కంపెనీ అభిప్రాయపడింది. అలాగే గాళ్‌ఫ్రెండ్ లేని వారి కోసం సంస్థ మరో ఆఫర్ కూడా ప్రకటించింది. టిండర్ ప్లాటినం, టిండర్ గోల్డ్ సబ్‌స్క్రిప్షన్‌లను కూడా అందిస్తోంది. ఆ యాప్ ద్వారా నచ్చిన వ్యక్తితో స్నేహం చేసి వారితో డేటింగ్‌కు వెళ్లవచ్చు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: ఈ పజిల్‌ను కేవలం 1 శాతం మందే పరిష్కరించగలిగారు.. ఈ ఫొటోలోని పులిని కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి