Share News

Viral: వామ్మో.. కోతి ముందు ‘జై శ్రీరామ్’ అంటే ఇలా జరుగుతుందా!? వైరల్ వీడియో

ABN , Publish Date - Oct 07 , 2024 | 11:56 AM

తన ఎదురుగా హరే రామ.. జై శ్రీరామ అని ఆలపిస్తున్న మహిళ చేయిని ఓ కోతి ఆప్యాయంగా హత్తుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాకుండా, ఆ పాటకు కోతి లయబద్ధంగా తల ఊపడం కూడా నెటిజన్లు ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

Viral: వామ్మో.. కోతి ముందు ‘జై శ్రీరామ్’ అంటే ఇలా జరుగుతుందా!? వైరల్ వీడియో

ఇంటర్నెట్ డెస్క్: కోతులు ఎంత అల్లరి చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు అవి ఎప్పుడు ఏం చేస్తాయో చెప్పడం కష్టం. అప్పటివరకూ ప్రశాంతంగాను ఉండి సడెన్‌గా దాడికి దిగగలవు. అయితే, కోతులు చాలా తెలివైనవనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సంక్లిష్టమైన చేతలు, ముఖకవళికలతో అవి ఒకదానితో మరొకటి సంభాషించుకుంటాయి. మనుషుల్లాగే అవి కూడా చాలా భావోద్వేగాలకు లోనవుతాయి. అయితే, కొన్ని సార్లు అవి చేసే పనులకు అర్థం ఏంటో, కారణాలు ఏంటో తెలీక ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.


Viral: ఈ వీధి వ్యాపారి ముందు టెకీలు కూడా దిగదుడుపే! ఇతడి రేంజ్ ఏంటో చూస్తే..

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ హోటల్‌లో టేబుల్‌పైకి వచ్చిన ఓ కోతి హఠాత్తుగా ఎదురుకుండా ఉన్న మహిళ చేయిపై ఆప్యాయంగా ఒరిగిపోయింది. తొలుత టేబుల్‌పై కూర్చున్న కోతిని చూస్తూ మహిళ హరే రామ, హరే కృష్ణ.. జై శ్రీరామ.. అంటూ జపించింది. ఆ తరువాత పక్కనున్న వారు కూడా గొంతు కలుపుతూ రామ నామం చేశారు. వాళ్లు ఇలా పాడుతుంటే కోతి కాసేపు అందరి వైపు తదేకంగా చూసింది. ఆ తరువాత ఎదురుగా ఉన్న మహిళ చేతిపై కూర్చుని ఆమె భుజంపై తలఆన్చింది. అంతేకాకుండా, వారు పాడే పాటకు అనుగూణంగా తల ఆడించింది. ఆమె చేయిని మరింత గట్టిగా పట్టుకుంటూ ఏదో భావోద్వేగానికి లోనవుతున్నట్టు చేసింది.


Viral: భారతీయులకే జాబ్స్ ఇస్తున్నారు.. కెనడా శ్వేతజాతీయురాలి సంచలన ఆరోపణ

ఆనంద్ అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశారు. అసలు ఆ రోజు ఏం జరిగిందీ చెప్పుకొచ్చారు. తమది కేరళ అని, ఆ రోజు బద్రీనాధ్‌లోని ఓ హోటల్‌కు తాము వెళ్లామని అతడు చెప్పాడు. అయితే, తాము రెస్టారెంట్‌లోకి వెళుతుండగా ఓ కోతి తమను ఫాలో అయ్యిందని అన్నాడు. ఆ తరువాత రామ నామం జపించగానే కోతి అలా వింతగా ప్రవర్తించిందని చెప్పుకొచ్చారు.

Viral: రూ.27 వేలకే ఐఫోన్ 16 కొనుక్కుని.. చివరకు విచారం! అసలేమైందంటే..


ఇక వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. కోతి వింత ప్రవర్తనకు గల కారణం ఏమిటో అని కొందరు సందేహం వెలిబుచ్చారు. రామ నామ స్మరణకు కోతి కూడా స్పందించిందని కొందరు కామెంట్ చేశారు. పాటకు అనుగూణంగా కోతి లయబద్ధంగా తల ఊపడం నిజంగా అద్భుతమే అని అన్నారు. ‘‘జంతువులను ఓ పట్టాన అర్థం చేసుకోలేము. మనుషుల పట్ల తమకున్న ఇష్టతను అవి విచిత్రంగా వ్యక్తీకరిస్తుంటాయి’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వైరల్ అవుతున్న ఈ వీడియోకు లక్షల కొద్దీ వ్యూస్ వచ్చి పడుతున్నాయి. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Viral: వీడేం దొంగరా బాబూ! చోరీకొచ్చి.. అంట్లు తోమి..బట్టలు ఉతికి.. ఆపై..

Read Latest and Viral News

Updated Date - Oct 07 , 2024 | 12:04 PM