Mount Everest: బాప్‌రే.. మైండ్ బ్లాకయ్యే వీడియో.. ఎవరెస్ట్ శిఖరంపై నుంచి 360 డిగ్రీల వ్యూ ఎలా ఉందో చూసేయండి!
ABN , Publish Date - Feb 04 , 2024 | 02:07 PM
అసలే శిఖరాల దిగ్గజం ఎవరెస్ట్, దాని పై నుంచి 360డిగ్రీల వ్యూ అంటే ఈ మాత్రం ఉంటాది మరి.
సోషల్ మీడియోలో రోజూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిలో కొన్ని సిల్లీగా ఉంటే మరికొన్ని షాకింగ్ గానూ, ఆసక్తిగానూ ఉంటాయి. కొన్ని వీడియోలు చూసినప్పుడు వావ్ అనే పదం తప్ప ఇంకొకటి గుర్తుకురాదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మీరూ అదే అంటారు. అసలే శిఖరాల దిగ్గజం ఎవరెస్ట్, దాని పై నుంచి 360డిగ్రీల వ్యూ(Mount Everest 360degrees view) అంటే మామూలుగా ఉండదు. ప్రస్తుతం ఈ వ్యూ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
ఇది కూడా చదవండి: బోర్లా పడుకునే అలవాటుందా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?
ఎవరెస్ట్ పర్వతం(Mount Everest) చిన్నతనపు సోషల్ స్టడీస్ జ్ఞాపకం. పుస్తకాలలో చదువుకోవడం, ఫొటోలలో చూడటం తప్ప దగ్గరగా చూడటం కానీ శిఖరం పైన ఎలా ఉంటుందనే విషయం కానీ చాలామందికి తెలియదు. ఎంతోమంది పర్వతారోహకులకు ఎవరెస్ట్ అధిగమించడమనే కల ఉంటుంది. అయితే సగటు ప్రజలు దాన్ని అధిరోహించడం, దానిపై నుంచి చుట్టూ ఉన్న ప్రాంతం ఎలా ఉంటుందో చూడటం సాధ్యం కాదు.. కానీ ఓ వీడియో ఇప్పుడు ఆ లోటును తీరుస్తోంది. వీడియోలో కొంతమంది పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరం అంచున నిలబడి ఉండటం కనిపిస్తుంది. వారు కెమెరాతో 360డిగ్రీల వ్యూ ను చిత్రీకరించారు. శిఖరం చుట్టూ వృత్తాకారంలో భూమి, భూమికి కాస్త ఎగువన సూర్యుడు కనిపిస్తున్నాడు. ఈ వీడియో చూస్తుంటే చాలా షాకింగ్ గా ఉంది. శిఖరం మీద ఉన్న వాతావరణ ప్రభావం కారణంగా పర్వతారోహకులు కూడా భయపడుతూ కనిపిస్తున్నారు. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. దీన్ని Ashraf El Zarka అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.