Viral: రైలు అడుగు భాగానికి వేళ్లాడుతూ 290 కిలోమీటర్ల ప్రయాణం.. టిక్కెట్ లేని ప్రయాణికుడి దుస్సాహసం
ABN , Publish Date - Dec 28 , 2024 | 10:03 AM
రైలు అడుగు భాగంలో చక్రాల మధ్య జాగ్రత్తగా వేళ్లాడుతూ ఓ వ్యక్తి ఏకంగా 290 కిలోమీటర్లు ప్రయాణించాడు. మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: రైలు ప్రయాణికులు అనేక రకాలు. కొందరు జనరల్ బోగీలో ప్రయాణిస్తారు. మరికొందరు స్లీపర్ క్లాస్‌లో వెళుతుంటారు. కొందరికి ఏసీ కోచ్‌లే ఇష్టం. ఇక రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్లలో కొందరు రైలు బోగీ మెట్లపై కూర్చుని కూడా వెళుతుంటారు. ఏకంగా రైలు ఇంజెన్ ఎక్కి ప్రయాణించిన వారి గురించీ వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వ్యక్తి వీళ్లందరికంటే చాలా డిఫరెంట్. అతడు అత్యంత ప్రమాదకరంగా రైలు అడుగు భాగానికి వేళ్లాడుతూ ప్రయాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా జనాలు ఆ దృశ్యాల్ని చూసి నోరెళ్లబెడుతున్నారు (Viral).
Viral: మార్చరీలో జాబ్‌కు వింత పరీక్ష.. శవాల మధ్య 10 నిమిషాల పాటు.
మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. దానాపూర్ ఎక్స్‌ప్రెస్ అడుగు భాగంలో చక్రాల మధ్య రాడ్డుపై జాగ్రత్తగా కాళ్లు పెట్టుకుని ఏకంగా 290 కిలోమీటర్ల దూరం అతడు ప్రయాణించాడు. ఇతార్సీ నుంచి జబల్‌పూర్ వరకూ ఇలా అత్యంత ప్రమాదకర రీతిలో వెళ్లాడు.
జబల్ పూర్ స్టేషన్‌లో క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఏవో పరీక్షలు నిర్వహిస్తూ అతడిని గమనించారు. బోగీ అడుగు భాగానికి వెళ్లాడుతూ అతడు ప్రయాణించాడని తెలిసి అవాక్కయ్యారు. సిబ్బంది గుర్తించిన వెంటనే అతడు రైలు కింద నుంచి బయటకు వస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.
Viral: వధువుకు షాక్! రొట్టెలు లేటుగా వడ్డించారని మరో యువతిని పెళ్లాడిన వరుడు!
ఏం చేస్తున్నావని ప్రశ్నించగా అతడు జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు. టిక్కెట్టు కొనే డబ్బులు లేక ఇలా ప్రమాదకర జర్నీకి సిద్ధమైనట్టు వివరించారు. రైలు చక్రాల మధ్య భాగాన జాగ్రత్తగా ఇరుక్కుని కూర్చుని ప్రయాణించినట్టు వివరించారు. దీంతో, షాకైపోవడం అధికారుల వంతైంది. అయితే, అసలు అక్కడ అతడు ఎలా చేరగలిగాడనేది చిక్కు ప్రశ్నగా మారింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన అధికారులు ఘటనపై లోతైన దర్యాప్తు ప్రారంభించారు.
విమానాల్లో కూడా ఇలాంటి ప్రమాదకర జర్నీలు చేస్తూ అనేక మంది అసువులు బాసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అల్పాదాయ దేశాల వారు అగ్రరాజ్యాల్లో కాలుపెట్టేందుకు విమానం చక్రాలు ఉండే వీల్ వెల్‌లో దాక్కుని వెళ్లేందుకు ట్రై చేస్తుంటారు. వీల్ వెల్‌లో అతి శీతల ఉష్ణోగ్రత్తలు, ప్రాణవాయువు తక్కువగా ఉండటంతో అనేక మంది మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోతారు. కొందరు అదృష్టవంతువు మాత్రం ప్రాణాలతో బయటపడతారు.
Viral: భర్త నుంచి విడాకుల కోసం సెక్స్ వర్కర్‌ను ఎరగా వేసి మాస్టర్ ప్లాన్!