Share News

Viral: వీడియో కాల్‌లో ఇంటర్వ్యూ! ఉద్యోగార్థి చేసిన పనికి కంపెనీ యజమానికి షాక్!

ABN , Publish Date - Jul 30 , 2024 | 10:22 PM

నేటి యువతలో కొందరికి ఉద్యోగమంటే లక్ష్యం లేదంటూ ఓ స్టార్టప్ సంస్థ యజమాని లింక్డ్‌ఇన్‌లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తూ సంస్థ యజమానితో ఏకీభవించారు.

Viral: వీడియో కాల్‌లో ఇంటర్వ్యూ! ఉద్యోగార్థి చేసిన పనికి కంపెనీ యజమానికి షాక్!

ఇంటర్నెట్ డెస్క్: నేటి యువతలో కొందరికి ఉద్యోగమంటే లక్ష్యం లేదంటూ ఓ స్టార్టప్ సంస్థ యజమాని లింక్డ్‌ఇన్‌లో పెట్టిన పోస్టు వైరల్‌గా (Viral) మారింది. ముంబైకి చెందిన సెనైన్ సావంత్ ముంబైలో ఓ స్టార్టప్ సంస్థ ప్రారంభించారు. సంస్థలో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ జాబ్‌ కోసం మంచి ఉద్యోగులు దొరక్క ఆమె సతమతమవుతున్నారు. పలువురు అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆమె ముందుకు ఓ అభ్యర్థి రెజ్యూమే వచ్చింది. అయితే, దీని ఆధారంగా ఆమె పూర్తి అంచనాకు రాలేకపోయింది. అభ్యర్థి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తాడా? కనీసం ట్రెయినీగా అన్నా పనికివస్తారా అన్న విషయంలో ఆమె నిర్ధారణకు రాలేకపోయింది. దీంతో, సదరు వ్యక్తిని వీడియో కాల్‌లో ఇంటర్వ్యూ చేసింది.

Viral: ప్రమాదకరమైన మొసలి పక్కన పిల్లల్ని నిలబెట్టి ఫొటో తీసిన పేరెంట్స్!


వీడియో కాల్ ఇంటర్వ్యూకు హాజరైన వ్యక్తి తన కంప్యూటర్ కెమెరా ఆన్ చేసి ముఖం చూపించలేదు. ఎందుకని అడిగితే ఓఎస్ అప్‌డేట్ కారణంగా ల్యాప్‌టాప్ కెమెరా ఆన్‌కావట్లేదని చెప్పుకొచ్చాడు. దీంతో సావంత్.. కెమెరా ఆన్‌ అయినప్పుడే ఇంటర్వ్యూ ప్రారంభిద్దామని మర్యాదగానే చెప్పింది. సరేనని ఉద్యోగార్థి కాల్ కట్ చేశారు (Mumbai entrepreneur shares hiring horror story ).

ఆ తరువాత వాట్సాప్ చాట్ సందర్భంగా అభ్యర్థి మితిమీరి మాట్లాడారు. వీడియో కాల్ ఇంటర్వ్యూ విషయాన్ని తాను స్పష్టంగానే పేర్కొన్నానని సావంత్ చెప్పగా ఉద్యోగార్థి మాత్రం రెచ్చిపోయాడు. ఉద్యోగం అని చెప్పి ట్రెయినీ పోస్టు గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. రెజ్యూమేలోని వివరాలను బట్టి ట్రెయినీ పోస్టుకు అభ్యర్థిని పరిగణనలోకి తీసుకుంటే తప్పేంటని, సామర్థ్యాన్ని బట్టి అవకాశాలు ఉంటాయనే అర్థంలో ఆమె చెప్పింది.


దీనికి స్పందించిన అభ్యర్థి తనకు ఏడాది అనుభవం ఉందంటూ మరింత చిరాకు ప్రదర్శించారు. చివరకు సావంత్‌ను అనకూడని మాట అన్నారు. దీంతో, ఆశ్చర్యపోయిన ఆమె నీ సంస్కారం ఇంతే అంటూ సంభాషణ ముగించింది. అనంతరం, ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకుంది. జెన్ జెడ్‌కు చెందిన కొందరు యువతకు జాబ్ అంటే లక్ష్యం లేదని, తామేదో ప్రత్యేకమని, అందరూ తమ అడుగులకు మణుగులొత్తాలన్న భావనలో ఉన్నారని కామెంట్ చేసింది. వాళ్లకి ఉద్యోగాలంటే తమకు నచ్చినప్పుడు చేసుకునే ఆదాయమార్గాల్లా మారాయని కామెంట్ చేశారు. నెటిజన్లు అనేక మంది ఆమెతో ఏకీభవించారు.

Read Viral and Telugu News

Updated Date - Jul 30 , 2024 | 10:23 PM