Anand Mahindra: వెనిస్‌లో కూడా ముంబై తరహా ట్రాఫిక్ జామ్.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్..
ABN , Publish Date - Sep 17 , 2024 | 04:58 PM
తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన, ఆసక్తికరంగా అనిపించిన వీడియోలను తన ఫాలోవర్లతో పంచుకుంటారు. పలు ఘటనలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు.
తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన, ఆసక్తికరంగా అనిపించిన వీడియోలను తన ఫాలోవర్లతో పంచుకుంటారు. పలు ఘటనలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఆనంద్ ఓ వీడియోను షేర్ చేశారు. ఇటలీ (Italy)లోని వెనిస్ (Venice)కు సంబంధించిన వీడియోను ఆయన్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఆ వీడియోపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
ఇటలీలోని ప్రముఖ టూరిస్ట్ ప్రాంతం వెనిస్. నీటిపై తేలియాడే నగరంగా పేరు పొందిన వెనిస్‌లో బోటుపై ప్రయాణం మధురానుభూతిని మిగుల్చుతుంది. అయితే ఇటీవల ఆ బోటు ప్రయాణం కూడా కాస్త స్ట్రెస్‌ఫుల్‌గా మారిందట. ఎందుకంటే టూరిస్ట్‌లు ఎక్కువై ట్రాఫిక్ జామ్ పెరగడమేనట. తాజాగా ఆనంద్ షేర్ చేసిన వీడియోలో.. ఓ కాలువపై పడవలు వరుసగా నెమ్మదిగా వెళ్తున్నాయి. ఆ వీడియోను షేర్ చేసిన ఆనంద్.. ``ముంబై తరహా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడానికి మాత్రమే వెనిస్ వరకు వెళ్లాలి. అయితే ముంబైతో పోలిస్తే అక్కడి ట్రాఫిక్ కష్టాలు తక్కువే అని అంగీకరిస్తున్నాను`` అంటూ ఆనంద్ మహీంద్రా కామెంట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 1.83 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వర్షాకాలంలో వెనిస్ వెళ్లడం కంటే ఢిల్లీ వెళ్లడం ఎంతో ఉత్తమం. వెనిస్ లాగానే ఢిల్లీ వీధులు కూడా నీటితో నిండిపోతాయి``, ``ఎంత ట్రాఫిక్ జామ్ అయినా అక్కడ కిందకు దిగలేం`` అంటూ నెటిజజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: పాపం.. హీరోలా దూసుకుపోదాం అనుకున్నాడు.. చివరకు రెండు బస్సులు మధ్య ఇరుక్కున్నాడు..
Optical Illusion: మీ దృష్టి ఎంత షార్ప్‌గా ఉంది?.. ఈ ఫొటోలో భిన్నంగా ఉన్న గొడుగును కనిపెట్టండి..
Viral Video: వార్నీ.. ఈ బుడతడు భలే ధైర్యవంతుడు.. బల్లిని పట్టుకుని ఎలా ఆడుతున్నాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..