Share News

Viral: గ్రహాంతరవాసులు ఉన్నారు! త్వరలో శాస్త్రవేత్తల కీలక ప్రకటన!!

ABN , Publish Date - Oct 15 , 2024 | 04:28 PM

గ్రహాంతర వాసుల ఆనవాళ్లు దొరికాయని ఫ్రముఖ ప్రొఫెసర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ సైమన్ హోలాండ్ తాజాగా చెప్పుకొచ్చారు. త్వరలో శాస్త్రవేత్తలు ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేయొచ్చని అంటున్నారు.

Viral: గ్రహాంతరవాసులు ఉన్నారు! త్వరలో శాస్త్రవేత్తల కీలక ప్రకటన!!

ఇంటర్నెట్ డెస్క్: ఏలియన్స్ లేదా గ్రహాంతరవాసులు ఉన్నారా? అంటే లేరని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అనంతమైన విశ్వంలో మనిషిలాంటి లేదా అంతకుమించి మేధోశక్తి కలిగిన జీవులు ఉండే అవకాశాలు ఎక్కువే. కానీ, వాటి ఉనికికి సంబంధించిన ఆధారాలు ఇప్పటివరకూ శాస్త్రవేత్తలకు లభించలేదు. అయితే, వచ్చే నెలలో ఈ పరిస్థితి మారబోతోందని ప్రొఫెసర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ సైమన్ హోలాండ్ తాజాగా చెప్పుకొచ్చారు. గ్రహాంతర వాసుల ఆనవాళ్లు దొరికాయని, త్వరలో శాస్త్రవేత్తలు ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేయొచ్చని అంటున్నారు (Evidence of Extra terrestrial life).

NRI: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు అవమానం! జాతీయపతాకాన్ని రూపొందించమని అడగడంతో..


హోలాండ్ ఇప్పటికే నాసా, బీబీసీ వంటి సంస్థల కోసం సాంకేతికాంశాలపై డాక్యుమెంటరీలు నిర్మించారు. ఆయనకు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇటీవల ఆయన మాట్లాడుతూ ఏలియన్ల ఉనికికి సంబంధించిన ఆధారాలు దొరికాయన్నారు. హోలాండ్ చెబుతున్న దాని ప్రకారం, గ్రహాంతరవాసుల ఉనికిని కనుగొనేందుకు ఉద్దేశించిన బ్రేక్‌త్రూ లిజన్ ప్రాజెక్టు వర్గాలకు ఈ అనవాళ్లు లభించాయి.

Viral: నన్ను భయ్యా అని పిలవొద్దు.. ప్రయాణికులకు క్యాబ్ డ్రైవర్ వింత కండీషన్


సుమారు 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ప్రాక్సీమా సెంటారీ అనే నక్షత్రం సమీపం నుంచి రెడియో సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ వెలువడిన ప్రాంతాన్ని వారు బీసీఎల్ - 1 అని పిలుస్తున్నారు. అంతరిక్షంలో రేడియో తరంగాలు సాధారణమే గానీ ఈ సిగ్నల్ మాత్రం ప్రత్యేకమైనదట. మనషులు కమ్యూనికేషన్ కోసం వాడే రేడియో సిగ్నల్ మాదిరిగా ఈ సిగ్నల్ ఉందట. దీన్నిబట్టి, ఇది కచ్చితంగా మేధోసంపన్నమైన గ్రహాంతరజీవుల నుంచి వచ్చి ఉండొచ్చని అంటున్నారు. అయితే, చైనా శాస్త్రవేత్తలకు కూడా ఈ సిగ్నల్ ఉనికి, అది వెలువడుతున్న ప్రాంతం గురించి తెలిసిపోయిందట. అయితే, ఈ సిగ్నల్ గ్రహాంతరవాసులదే అని అనేందుకు కావాల్సిన కచ్చితమైన సాంకేతిక ఆధారాలు వెతికిపట్టుకునే పనిలో పరిశోధకులు ఉన్నారు.

Viral: వామ్మో.. ఇది రావణ దహనమా..అణుబాంబు విస్ఫోటనమా! షాకింగ్ సీన్స్


గ్రహాంతర వాసులు ఉన్నారన్న విషయం దాదాపుగా రూఢీ అయిపోయిందని ప్రొఫెసర్ హోలండ్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ముందుగా ఎవరు ప్రకటిస్తారన్నదే ఇప్పుడు ప్రధానమని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో బ్రేక్‌త్రూ లిజన్ ప్రాజెక్టుతో చైనా శాస్త్రవేత్తలు కూడా పోటీ పడుతున్నారట. వచ్చే నెలలోనే దీనిపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని హోలండ్ చెప్పుకొచ్చారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Viral: కోడి ముందా? గుడ్డు ముందా? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే..

Read Latest and Viral News

Updated Date - Oct 15 , 2024 | 05:23 PM