Share News

Lord Ganesh: గణేశ్ ప్రతిమ పట్టుకొని బాలుడి ఉద్వేగం

ABN , Publish Date - Sep 13 , 2024 | 12:10 PM

వినాయక నిమజ్జనం అంటే చాలు పిల్లలకు బాధేస్తోంది. గణేశుడి ముందు పూజ చేసిన పిల్లలకు నిమజ్జనం చేసేందుకు మనస్సు ఏ మాత్రం అంగీకరించదు. దేశ రాజధాని ఢిల్లీలో ఓ బాలుడు తీవ్ర భాద్వేగానికి గురయ్యాడు.

Lord Ganesh: గణేశ్ ప్రతిమ పట్టుకొని బాలుడి ఉద్వేగం
Nine Year Old Cries

దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ నెలకొంది. గణనాథుడి సేవలో పిల్లలు బిజీగా ఉన్నారు. ఉదయం, సాయంత్రం గణేశ్ మండపాల వద్దే ఉంటున్నారు. మరికొందరు ఇళ్లలో బొజ్జ గణపయ్యకు పూజలు చేస్తున్నారు. మూడో రోజు నుంచి వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఇన్ని రోజులు ఇష్టంగా పూజించిన గణపయ్యను నిమజ్జనం చేసేందుకు పిల్లలకు మనసు రాదు. ఓ చిన్నారి అలా తల్లడిల్లి పోయాడు.


వద్దు.. వెళ్లొద్దు...

ఢిల్లీ శివారులో ఓ కాలువ గట్టు వద్ద ఓ తొమ్మిదేళ్ల బాలుడు అభినవ్ అరోరా ఉన్నాడు. ఆరెంజ్ డ్రెస్ వేసుకొని చక్కగా ఉన్నాడు. చేతిలో స్వీట్ బాక్స్ లడ్డూ ఉంది. గణపయ్య వద్ద పెట్టి భావోద్వేగానికి గురయ్యారు. అతని వెంట బంధువులు ఉన్నారు. నిమజ్జనం చేద్దాం అంటే చాలు ఏడ్చేశాడు. గణపయ్య వెళ్లిరా అని చెప్పేందుకు అభినవ్‌కు ధైర్యం కాలేదు. పక్కన ఉన్న ఒకతను నిమజ్జనం చేద్దాం అని అనగా.. రెండు నిమిషాలు అని అడిగారు. ఆ వీడియో చూస్తే బొజ్జ గణపయ్య మీద అతనికి ఉన్న భక్తిభావం ఏంటో తెలుస్తోంది.

ganesh-1.jpg


మళ్లీ రా.. అంటూనే

ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది తెగ చక్కర్లు కొడుతోంది. వినాయక విగ్రహాన్ని పట్టుకొని అభినవ్ అరోరా ముద్దుగా కనిపించాడు. మళ్లీ రా వినాయక అని చక్కగా పిలుస్తున్నాడు. నిమజ్జనం చేసేందుకు ఏ మాత్రం మనసు రాలేదు. ఏడ్చేశాడు. ఆ వీడియోకు 24 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. చాలా మంది లైక్ చేశారు. కామెంట్లతో ఆ సెక్షన్ నిండి పోయింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం

Updated Date - Sep 13 , 2024 | 12:15 PM