Share News

Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ తన జుట్టుకు రంగు వేయరు ఎందుకు? తన చీరకట్టు గురించి ఆమె వేసిన పంచ్ ఏంటంటే..!

ABN , Publish Date - Jul 24 , 2024 | 08:23 AM

జూలై 23 వ తేదీన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే బడ్జెట్ కంటే ఎక్కువగా నిర్మలా సీతారామన్ సింప్లిసిటీ గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది .

Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ తన జుట్టుకు రంగు వేయరు ఎందుకు? తన చీరకట్టు గురించి ఆమె వేసిన పంచ్ ఏంటంటే..!
Nirmala Sitharaman

నిర్శలా సీతారామన్(Nirmala Sitharaman) భారతీయులకు పెద్దగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. మోదీ ప్రభుత్వం(Modi Government) మూడవ సారి అధికారంలోకి వచ్చాక ఆయన కేబినెట్ లో ఆర్థిక శాఖ మంత్రిగా(Financial Minister) ఆమె మరోసారి భాద్యతలు చేపట్టారు. జూలై 23 వ తేదీన ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే బడ్జెట్ కంటే ఎక్కువగా నిర్మలా సీతారామన్ సింప్లిసిటీ(Nirmala Sitharaman Simplicity) గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది . చాలా సింపుల్ గా ఉండే చీర, ముగ్గు బుట్ట లాంటి తెల్ల జుట్టుతో ఆమె బడ్జెట్ సమర్పించారు. అసలు నిర్మలా సీతారామన్ జుట్టుకు రంగు వేయరు ఎందుకని? 'మీరు చాలా సాధారణంగా ఉండే చీరలు కడతారు ఎందుకు?' అని ఒక ప్రైవేట్ షోలో ఆమెకు ఎదురైన ప్రశ్నకు ఆమె ఎలా రియాక్ట్ అయ్యారు? ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే..

ఈ కెరాటిన్ ఫుడ్స్ తింటే చాలు.. జుట్టు రాలడం ఆగిపోతుంది..!


నిర్మలా సీతారామన్ భారతీయ శక్తివంతమైన మహిళలలో ఒకరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె ఎప్పుడూ సింపుల్ గా ఉన్న చీరలో, తెల్ల జుట్టులో కనిపిస్తుంటారు. అయితే ఒకసారి ఒక ప్రైవేట్ షోలో హోస్ట్ ఆమెను ఆమె కట్టే చీరల గురించి, జుట్టుకు రంగు వేయకపోవడం గురించి ప్రశ్నించారు. దానికి నిర్మలా సీతారామన్ కోపంతో ఘాటుగానే సమాధానం ఇచ్చారు. 'ఒక మగ వ్యక్తి ఆర్థిక మంత్రిగా ఉండి అతను సింపుల్ గా ఉన్న దుస్తులు ధరించి బడ్జెట్ సమర్పించడానికి వెళితే మీరు అతనిని ఇలాంటి ప్రశ్న అడుగుతారా? నా చీర గురించి, నా జుట్టు గురించి ప్రశ్నలు అడగవద్దు.. దాని బదులు మీరు బడ్జెట్ పై దృష్టి పెట్టండి' అని సమాధానం ఇచ్చారు.

పాదాలు, మడమల్లో ఈ లక్షణాలు ఉంటే చక్కెర స్థాయిలు ఎక్కువున్నట్టే..!


కోవిడ్ కు ముందు నిర్మలా సీతారామన్ జుట్టుకు రంగు వేసేవారు. ఎప్పుడూ నల్లని జుట్టుతో కనిపించేవారు. కానీ ఆ తరువాత ఆమెలో మార్పు వచ్చింది. జుట్టుకు రంగు వేసి తన తెల్ల జుట్టును దాచుకోవడం మానేశారు. సాధారణ రోజులు అయినా, బడ్జెట్ సమర్పణ అయినా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గానే ఉంటారు. అయితే ఇలా జుట్టుకు రంగు వేయకపోవడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. రూపాన్ని బట్టి కాకుండా తెలివితేటలు, ప్రతిభ కారణంగా మనిషికి గౌరవం ఇవ్వాలనే విషయాన్ని చెప్పకనే చెప్పడం దీని ఉ్దదేశ్యం అంటున్నారు.

వర్షాకాలంలో ఈ కాంబినేషన్ ఫుడ్స్ అస్సలు తినకండి..!

రాత్రిపూట చేసే ఈ పొరపాట్ల వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 24 , 2024 | 08:23 AM