Share News

North Korea: ఆ దేశంలో పోనీటెయిల్‌పై నిషేధం.. వేసుకుంటే ఎలాంటి శిక్షలు విధిస్తారంటే..

ABN , Publish Date - Sep 02 , 2024 | 07:09 PM

ప్రజాస్వామ్య దేశాల్లో జీవనం సాగిస్తున్న వారికి కొన్ని దేశాల నియంతృత్వ కథలు వింటే ఆశ్చర్యం వేయక మానదు. ప్రజల ఆహార్యం దగ్గర్నుంచి వారి మేకప్, ఇతర అలవాట్లను కూడా దేశాధినేతే నిర్ణయిస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడమే కష్టంగా ఉంటుంది.

North Korea: ఆ దేశంలో పోనీటెయిల్‌పై నిషేధం.. వేసుకుంటే ఎలాంటి శిక్షలు విధిస్తారంటే..
Ponytail

ప్రజాస్వామ్య దేశాల్లో జీవనం సాగిస్తున్న వారికి కొన్ని దేశాల నియంతృత్వ కథలు వింటే ఆశ్చర్యం వేయక మానదు. ప్రజల ఆహార్యం దగ్గర్నుంచి వారి మేకప్, ఇతర అలవాట్లను కూడా దేశాధినేతే నిర్ణయిస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడమే కష్టంగా ఉంటుంది. అలాంటి నియంతృత్వ పోకడల గురించి వింటే గతంలో హిట్లర్ పేరు వినిపించేది. అలాంటి హిట్లర్‌ కూడా ప్రస్తుత ఉత్తర కొరియా (North korea ) అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (kim jong un) ముందు దిగదడుపేనేమో. తాజాగా ఉత్తరకొరియా మహిళలకు కిమ్ జాంగ్ విధించిన నిబంధన గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే (Viral News).


సాధారణంగా చాలా మంది మహిళలు వయసుతో సంబంధం లేకుండా పోనీ టెయిల్ (Ponytail hairstyle) వేసుకుని కనబడుతుంటారు. కష్టపడి సమయం వెచ్చించి జడ వేసుకునే వెసులుబాటు లేని కొందరు పోనీ టెయిల్ వేసుకుని ఆఫీస్‌లకు, కాలేజీలకు వెళ్లిపోతుంటారు. అలా మహిళలు పోనీ టెయిల్ వేసుకోవడంపై కిమ్ జాంగ్ నిషేధం విధించాడు. ఎవరైనా ఆ నిబంధనను అతిక్రమిస్తే శిక్ష (Punishments) కూడా కఠినంగానే ఉంటుంది. ఎవరైనా పోనీ టెయిల్ వేసుకుని కనిపిస్తే ముందు ఆ వ్యక్తికి పూర్తిగా గుండు గీసేస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు.


పొరుగున ఉన్న దక్షిణ కొరియా మహిళలు ఎక్కువగా పోనీ టెయిల్ హెయిర్‌స్టైల్‌తో కనబడుతున్నారని, తన దేశ మహిళలు అలా కనబడకూడదని కిమ్ జాంగ్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. కాగా, ఇప్పటికే జీన్స్, పొడవాటి జుట్టు, శరీరానికి అంటి పెట్టుకుని ఉండే దుస్తులు, సెమీ-ట్రాన్స్‌పరెంట్ స్లీవ్‌లు, షోల్డర్ బ్యాగ్‌లపై ఇప్పటికే నిషేధం విధించారు. తాజాగా ఈ జాబితాలోకి పోనీ టెయిల్ కూడా చేరిందట.

ఇవి కూడా చదవండి..

Anand Mahindra: ఒక్క నిమిషంలో 11 వాయిద్యాలు.. సూపర్ ట్యాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా..


Viral Video: ఈ దొంగ మామూలోడు కాదు.. కళ్ల ముందే రూ.5 లక్షల బంగారాన్ని ఎలా కొట్టేశాడో చూడండి..


Viral Video: రూల్స్ పాటించకపోతే అలాగే ఉంటుంది.. సింహం ఏం చేసిందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్!


Brain Teaser: కేవలం 1 శాతం మందే సరైన జవాబు చెప్పారు.. ఈ ఫొటోలోని వ్యక్తుల్లో ఎవరు సేఫ్..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 02 , 2024 | 07:09 PM