Share News

Anand Mahindra: ఒక్క నిమిషంలో 11 వాయిద్యాలు.. సూపర్ ట్యాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా..

ABN , Publish Date - Sep 02 , 2024 | 04:08 PM

ప్రతిభ అనేది ఎవరి సొత్తూ కాదు. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించేందుకు ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా అండగా నిలబడుతోంది. అనన్య సామాన్యమైన ట్యాలెంట్ ఉంటే వారిని ఆపడం ఎవరి తరమూ కాదు. తాజాగా ప్రముఖ గాయకుడు, సంగీతకారుడు రాఘవ్ సచార్ తన అద్భుత ట్యాలెంట్‌తో ఆకట్టుకున్నాడు.

Anand Mahindra: ఒక్క నిమిషంలో 11 వాయిద్యాలు.. సూపర్ ట్యాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా..
Anand Mahindra Raghav Sachar Video

ప్రతిభ (Talent) అనేది ఎవరి సొత్తూ కాదు. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించేందుకు ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా అండగా నిలబడుతోంది. అనన్య సామాన్యమైన ట్యాలెంట్ ఉంటే వారిని ఆపడం ఎవరి తరమూ కాదు. తాజాగా ప్రముఖ గాయకుడు, సంగీతకారుడు రాఘవ్ సచార్ (Raghav Sachar) తన అద్భుత ట్యాలెంట్‌తో ఆకట్టుకున్నాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra ) కూడా రాఘవ్ ట్యాలెంట్‌కు ఫిదా అయ్యారు. ట్విటర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో రాఘవ్ సచార్ 2001 నాటి బాలీవుడ్ క్లాసిక్ సాంగ్ ``దిల్ చాహ్తా హై`` (Dil Chahta Hai) ని ప్రదర్శించాడు. ఒక్క నిమిషం వ్యవధిలో 11 వాయిద్యాల సహకారంతో ఆ పాటను ప్లే చేశాడు. మొదట వేణువు, సాక్సోఫోన్ పట్టుకుని, ``దిల్ చాహ్తా హై`` ట్యూన్‌ను ప్లే చేశాడు. అనంతరం ఈలలు వేయడం, బాంజో వాయించడం, అనేక ఇతర వాయిద్యాలను మార్చుతూ పాటను ప్లే చేశాడు. అతని మొత్తం ప్రదర్శన ఆడియో-విజువల్ ట్రీట్‌లా అనిపించింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో ప్లే చేయగా అది వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియో ఆనంద్ మహీంద్రా దృష్టికి కూడా వచ్చింది. ఆ వీడియోను ఆనంద్ తన ట్విటర్ ఖాతాలో ప్లే చేశారు. ``అద్భుతమైన ట్యాలెంట్, ఒక నిమిషంలో 11 సంగీత వాయిద్యాలు. ఇది కేవలం సాధన వల్ల వచ్చిన కొత్తదనం మాత్రమే కాదు. కాలాతీతమైన ఫేవరెట్‌గా నిలిచిన ఈ పాటను ఆత్మీయంగా అన్వయించారు. బాగా చేశారు, రాఘవ్ సచార్. మా ఆదివారం చాలా హాయిగా మారింది`` అంటూ ఆనంద్ కామెంట్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ దొంగ మామూలోడు కాదు.. కళ్ల ముందే రూ.5 లక్షల బంగారాన్ని ఎలా కొట్టేశాడో చూడండి..


Viral Video: రూల్స్ పాటించకపోతే అలాగే ఉంటుంది.. సింహం ఏం చేసిందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్!


Brain Teaser: కేవలం 1 శాతం మందే సరైన జవాబు చెప్పారు.. ఈ ఫొటోలోని వ్యక్తుల్లో ఎవరు సేఫ్..!


Viral Video: రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు.. ఓ ట్రక్ ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 02 , 2024 | 04:08 PM