Share News

Viral: ఎయిర్ ఇండియాలో సేవాలోపం! లైఫ్‌లో కీలక ఘట్టానికి దూరమైన ప్రయాణికురాలు

ABN , Publish Date - Dec 22 , 2024 | 09:24 PM

ఎయిర్ ఇండియా విమానం 18 గంటలు ఆలస్యం కావడంతో తన జీవితంలో ముఖ్య ఘట్టానికి దూరమయ్యానంటూ ఓ విమానప్రయాణికురాలు నెట్టింట పంచుకున్న పోస్టు ప్రస్తుతం సంచలనంగా మారింది.

Viral: ఎయిర్ ఇండియాలో సేవాలోపం!  లైఫ్‌లో కీలక ఘట్టానికి దూరమైన ప్రయాణికురాలు

ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ ఇండియా విమానం 18 గంటలు ఆలస్యం కావడంతో తన జీవితంలో ముఖ్య ఘట్టానికి దూరమయ్యానంటూ ఓ విమానప్రయాణికురాలు నెట్టింట పంచుకున్న పోస్టు ప్రస్తుతం సంచలనంగా మారింది. అనేక మంది ఆమె పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీకి చెందిన శివాజీ బజాజ్ అనే మహిళ పెట్టిన ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది (Viral).

Viral: పెళ్లిచేసుకోనున్న మరో అపరకుబేరుడు.. రూ.5 వేల కోట్ల ఖర్చుతో వేడుక


ఇటలీలోని మిలాన్ నుంచి ఢిల్లీ వచ్చేందుకు తాను నవంబర్ 5 ఎయిర్ ఇండియా విమానం టిక్కెట్టు బుక్ చేసుకున్నట్టు ఆమె తెలిపారు. అయితే, విమానం 18 గంటల ఆలస్యంగా బయలుదేరుతుందని ఎయిర్‌పోర్టులో తెలిశాక షాకైపోయినట్టు చెప్పారు. తిండి, నివాస వసతికి దూరంగా ఎయిర్‌పోర్టులో గడపాల్సి వచ్చిందని చెప్పారు. మరుసటి రోజు తన చెల్లి వివాహానికి సంబంధించి మెహెందీ కార్యక్రమం ఉండటంతో తాను డైరెక్ట్ ఫ్లైట్ కోసం ఎయిర్ ఇండియా ఎంచుకున్నట్టు చెప్పారు. బిజినెస్ క్లాస్ సీటు కోసం రూ.50 వేలు పెట్టి అప్‌గ్రేడ్ చేసుకున్నట్టు కూడా వివరించారు. కానీ, ఇలా విమానం ఆలస్యం కావడంతో విధిలేని పరిస్థితుల్లో తాను మరో టిక్కెట్ బుక్ చేసుకుని ఇండియాకు వచ్చినట్టు చెప్పారు.

King Charles: నేనింకా బతికే ఉన్నా.. భారత సంతతి వ్యక్తితో బ్రిటన్ రాజు జోక్!


అదనంగా తాను చెల్లించిన రూ.50 వేలను తిరిగిస్తానన్న ఎయిర్ ఇండియా నెల రోజులు గడుస్తున్నా ఇవ్వకపోవడం తనను కలిచి వేస్తోందని చెప్పారు. ఎన్ని సార్లు వారిని ఈ విషయమై సంప్రదించినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికుల పట్ల కనీసం జాలి, బాధ్యత లేకపోవడం తనను కలిచి వేసిందని అన్నారు. ఎయిర్ ఇండియాలో తెలిసిన వారున్న తనకే ఈ పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ అనుభవాన్ని ఓ పీడకలగా అభివర్ణించారు.

ఈ పోస్టుపై కొందరు స్పందిస్తూ తమకు కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని అన్నారు. పది గంటల విమాన ప్రయాణంలో సీట్లు సరిగా లేకపోవడం, ఎంటర్‌టైన్‌మెంట్ సౌకర్యం లేకపోవడం తమను ఇబ్బంది పెట్టిందని ఓ వ్యక్తి తెలిపారు.

శివానీ పోస్టుపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఆమెకు క్షమాపణలు తెలిపింది. ఆమె టిక్కెట్ వివరాలను నేరుగా మెసేజీ చేస్తే సమస్యను త్వరంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.

Viral: ప్రియురాలి ఎఫైర్‌తో మనోవేదన! బాధితుడికి రూ.35 లక్షల పరిహారం!

Read Latest and Viral News

Updated Date - Dec 22 , 2024 | 09:24 PM