Share News

Viral: ప్రతి ఆసుపత్రిలో ఇలాంటి నర్సు ఉంటేనా.. వైరల్ వీడియో!

ABN , Publish Date - Apr 01 , 2024 | 05:40 PM

రోగిలో సంతోషం నింపేందుకు అతడితో కలిసి నర్సు డ్యాన్స్ వైరల్ వీడియో

Viral: ప్రతి ఆసుపత్రిలో ఇలాంటి నర్సు ఉంటేనా.. వైరల్ వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: రోగి కోలుకోవడంలో ఔషధాలతో పాటూ సానుకూల వాతావరణం కూడా చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. నిరాశానిస్పృహలు పేషెంట్ల శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా వ్యాధి నుంచి కోలుకోవడం ఆలస్యమవుతుంది. ఇలాంటి పరిస్థితిని నివారించేందుకు ఓ నర్సు చేసిన చర్య ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది. ఇది చూసిన జనాలు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Viral: కూతురు లండన్ నుంచి విదేశీ ప్రియుణ్ణి ఇంటికి తీసుకొస్తే..


కొలంబియా (Columbia) దేశానికి చెందిన ఓ నర్సు తన పేషెంట్లపై చూపిస్తున్న శ్రద్ధ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తోంది. ఆమె వీడియోను GoodNewsCorrespondent పేరిట ఉన్న ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేశారు. అక్కడ ఓ ఆసుపత్రిలో క్యాన్సర్ పేషెంట్లకు కీమోథెరపీ నిర్వహిస్తున్నారు. అయితే, క్యాన్సర్ బాధితుల్లో సానుకూల దృక్పథం, సంతోషం నింపాలనే ఉద్దేశంతో ఆసుపత్రివాళ్లు అనేక చర్యలు తీసుకున్నారు. కీమోథెరపీ ఇస్తున్న గదిని (Chemotherapy Session) రంగురంగుల పేపర్లు, బెలూన్లు, ఇతర డెకరేషన్ ఐటమ్స్‌తో అందంగా అలంకరించారు. నిత్యం అదే ఆసుపత్రిలో కీమోథెరపీ చేయించుకునే ఓ జేసన్‌కు ఆ గదిలో చికిత్స అందించారు. అంతేకాదు, అతడిని మరింత ఉత్సాహపరిచేందుకు ఓ నర్సు అతడితో కలిసి డ్యాన్స్ కూడా చేసింది (Nurse Dance with Cancer Patient). ఆసుపత్రి వర్గాలు కనబరుస్తున్న ప్రత్యేకశ్రద్ధ చూశాక జేసన్‌లో గూడుకట్టుకున్న నిరాశ తొలగి ముఖంలో నవ్వులు విరిశాయి.

బీచ్‌లో రెచ్చిపోయిన ఫుల్ స్పీడులో కారు నడిపాడు..చివరకు జరిగింది చూస్తే.. షాకింగ్ వీడియో!


ఇక వీడియోలో ఇదంతా చూసిన జనాలు ఆసుపత్రి వర్గాలతో పాటూ నర్సుపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. పేషెంట్లకు ఇంత నిస్వార్థంగా సేవ చేస్తున్న వీరు దైవాంశసంభూతులు అంటూ కొందరు కామెంట్ చేశారు. ఈ రోజు ఓ గుడ్ న్యూస్ విన్నందుకు చాలా సంతోషంగా ఉందని కొందరు కామెంట్ చేశారు. నిండు మనసుతో రోగి బాగోగులు కోరే ఇలాంటి నర్సులు ప్రతి ఆసుపత్రిలో ఉంటే రోగులు సంతోషంతో కళకళలాడతారని కొందరు అన్నారు.

ప్రతి సోమవారం ఇలా చేసి చూడండి.. ఆనంద్ మహీంద్రా సలహా వైరల్

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 01 , 2024 | 05:53 PM