Share News

Viral: డ్యూటీ దిగిపోయినా బాధ్యత మర్చిపోలేదు! ఈ పోలీసుకు సలామ్ చెప్పాల్సిందే!

ABN , Publish Date - Sep 02 , 2024 | 08:06 AM

డ్యూటీలో లేకపోయినా కూడా తన బాధ్యత మర్చిపోకుండా ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఓ ముంబై పోలీసు కానిస్టేబుల్‌పై ప్రస్తుతం నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.

Viral: డ్యూటీ దిగిపోయినా బాధ్యత మర్చిపోలేదు! ఈ పోలీసుకు సలామ్ చెప్పాల్సిందే!

ఇంటర్నెట్ డెస్క్: డ్యూటీలో లేకపోయినా కూడా తన బాధ్యత మర్చిపోకుండా ప్రయాణికుడిని కాపాడిన ఓ ముంబై పోలీసు కానిస్టేబుల్‌పై ప్రస్తుతం నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఉదంతాన్ని ముంబై పోలీసులు నెట్టింట పంచుకున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో కూడా షేర్ చేశారు (Viral).

Viral: లాటరీ గెలుస్తానని ఫ్రెండ్‌తో చెప్పాడు! ఆ రాత్రే కనకవర్షం!

‘‘డ్యూటీ ముగించుకుని ఇంటికెళుతున్న కానిస్టేబుల్ బలాసో ధాగే.. కదులుతున్న రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య చిక్కుకున్న ఓ ప్రయాణికుడిని గుర్తించి కాపాడారు. రైలు కింద పడకుండా రక్షించారు’’ అని క్యాప్షన్ పెట్టి ముంబై పోలీసులు ఈ వీడియోను షేర్ చేశారు. గోరేగావ్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగిందని చెప్పారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఆ ప్రయాణికుడు కాలు జారడంతో ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య చిక్కుకుపోయాడు. ప్రాణాపాయంలో పడ్డ అతడిని గుర్తించగానే సదరు కానిస్టేబుల్ రంగంలోకి దిగారు. మెరుపు వేగంతో స్పందించి.. అతడు రైలు కింద పడకుండా వెనక్కు లాగేశారు (Off Duty Cop Saves Man From Tragic Train Accident At Mumbai Station).


ఈ వీడియో సహజంగానే నెట్టింట వైరల్ అవుతూ జనాలను షాక్‌కు గురిచేస్తోంది. ఇప్పటివరకూ వీడియోకు 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ముప్పై వేలకు పైగా లైకులూ వచ్చాయి. ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘రిస్క్ చేసి మరీ ప్రయాణికుడిని కాపాడిన ఈ కానిస్టేబుల్‌కు సెల్యూట్ చెప్పాల్సిందే’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పోలీసును తగిన విధంగా సత్కరించాలని ఆకాక్షించాడు. విధుల్లో లేకపోయినా బాధ్యత మర్చిపోలేదంటూ పలువురు కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.


గతంలో కూడా రైల్వే పోలీసులు అపాయంలో పడ్డ పలువురు ప్రయాణికులను ప్రాణాలకు తెగించి మరీ కాపాడారు. అయితే, అధిక శాతం సందర్భాల్లో ప్రయాణికులు తమ నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నట్టు తేలింది. కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించడం, రైలు తలుపు వద్ద ఉన్న మెట్లపై నిలబడి ప్రయాణం తదితర చర్యల కారణంగా అపాయంలో పడుతున్న ఘటనలు గతంలో అనేకం వెలుగు చూశాయి. అయినా, ప్రజల్లో ఆశించిన మార్పులు రావట్లేదని ఆధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Latest and Viral News

Updated Date - Sep 02 , 2024 | 08:27 AM