Viral Video: ఒకవైపు ఆస్ట్రిచ్.. మరోవైపు మేక.. ఈ వెరైటీ బండిని చూసిన నెటిజన్లు ఎందుకు తిడుతున్నారంటే..
ABN , Publish Date - Nov 25 , 2024 | 12:24 PM
పాత కారును సరికొత్తగా డిజైన్ చేసే వారు కొందరైతే, మరికొందరు సాధారణ మోటార్ సైకిల్‌ను ఈవీగా మార్చేస్తున్నారు. అయితే ఇలాంటి విషయంలో ఒక వ్యక్తి అన్ని పరిమితులను దాటాడు. కొంచెం వింతగా ఆలోచించాడు.
ప్రస్తుతం చాలా మంది ప్రజలు వాహనాలతో కొన్ని ఆసక్తికరమైన విన్యాసాలు చేస్తున్నారు. పాత కారును సరికొత్తగా డిజైన్ చేసే వారు కొందరైతే, మరికొందరు సాధారణ మోటార్ సైకిల్‌ను ఈవీగా మార్చేస్తున్నారు. అయితే ఇలాంటి విషయంలో ఒక వ్యక్తి అన్ని పరిమితులను దాటాడు. కొంచెం వింతగా ఆలోచించాడు (Jugaad Video). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. జంతు సంరక్షణ గురించి ఆందోళన చెందుతున్నారు. అది చాలా క్రూరత్వం అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ilhanatalay అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. (Viral Video)
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి వెరైటీగా బండి నడుపుతున్నాడు. సాధారణంగా జంతువులు వాహనాలు లాగుతున్నప్పుడు రెండూ ఓకే సామర్థ్యం కలిగిన, రెండూ ఒకే పరిమాణంలో ఉన్న వాటిని ఎంచుకుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి తన బండికి ఒకవైపు భారీ పరిమాణంలో ఉన్న ఆస్ట్రిచ్ (Ostrich)ను కట్టాడు. మరోవైపు చిన్న మేకను (Goat) కట్టాడు. ఆ రెండూ బండి లాగుతుంటే అతడు కొరడా పట్టుకుని దర్జాగా కూర్చున్నాడు. నిజానికి ఈ బండికి సంబంధించిన బరువు మొత్తం ఆ నిప్పు కోడిపైనే పడుతోంది. రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మంది వీక్షిచారు. 48 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను వీక్షించారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``జంతు సంరక్షణ సంస్థ సభ్యులు ఎక్కడ ఉన్నారు``, ``ఇది చాలా క్రూరత్వం``, ``ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఫన్నీగా లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: అదేంటి.. కారును ఇలా కూడా డెకరేట్ చేస్తారా? ఆ కారును చూస్తే నవ్వాపుకోవడం కష్టం..
Viral Video: బ్యాడ్ లక్ అంటే ఇదే.. అమెరికాలో ఇంజనీరింగ్.. ఇండియాలో అడుక్కుంటున్నాడు..!
Viral Video: ఇలాంటి వాళ్ల వల్ల మరో మహమ్మారి వస్తుంది.. వింత బిర్యానీ చేసిన మహిళపై నెటిజన్ల ఆగ్రహం..
Optical Illusion Test: మీ దృష్టికి పరీక్ష.. ఈ గుహలో దాక్కున్న కుక్కను 5 సెకెన్లలో పట్టుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి