Share News

Optical Illusion: ఈ ఫోటోలో చాలా పెద్ద మిస్టేక్ ఉంది.. అదేంటో కనిపెట్టే సత్తా మీలో ఉందా?

ABN , Publish Date - Mar 08 , 2024 | 05:05 PM

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్స్‌.. అప్పట్లో వార్తా పత్రికల్లో(News Papers), స్పెషల్ పేజీల్లో సరదాగా ఇచ్చేవారు. కొన్ని బొమ్మలు ముద్రించి అందులో లోపాలు, తేడాలు కనిపెట్టాలంటూ(Optical Illusion Challenges) ఛాలెంజ్ విసిరేవారు. అవి చాలా సరదాగా ఉండేవి. వాటిని కనిపెట్టడం వలన మేధా శక్తి కూడా పెరుగుతుంది. అందుకే.. ప్రజలు వీటిని సీరియస్‌గా తీసుకునేవారు. సరదాగా ఉండటమే కాకుండా..

Optical Illusion: ఈ ఫోటోలో చాలా పెద్ద మిస్టేక్ ఉంది.. అదేంటో కనిపెట్టే సత్తా మీలో ఉందా?
Optical Illusion

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్స్‌.. అప్పట్లో వార్తా పత్రికల్లో(News Papers), స్పెషల్ పేజీల్లో సరదాగా ఇచ్చేవారు. కొన్ని బొమ్మలు ముద్రించి అందులో లోపాలు, తేడాలు కనిపెట్టాలంటూ(Optical Illusion Challenges) ఛాలెంజ్ విసిరేవారు. అవి చాలా సరదాగా ఉండేవి. వాటిని కనిపెట్టడం వలన మేధా శక్తి కూడా పెరుగుతుంది. అందుకే.. ప్రజలు వీటిని సీరియస్‌గా తీసుకునేవారు. సరదాగా ఉండటమే కాకుండా.. మానసిక శక్తి పెరగడం, మెదడు పనితీరు మెరుగడం, దృష్టి సామర్థ్యం పెరగడం వలన.. వాటిపై ఆసక్తి చూపేవారు.

అయితే, ఇప్పుడంతా డిజిటల్ మయం అయిపోయింది. ఆప్టికల్ ఇల్యూజన్ పిక్స్, డ్రాయింగ్స్ సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ ఉంది. అదేంటో కనిపెట్టడమే ఇప్పుడు మీ ముందు ఉన్న టాస్క్. చూసేందుకు చాలా ఈజీగా ఉన్నప్పటికీ.. ఆ మిస్టేక్‌ను కనిపెట్టడానికి కాస్త కష్టపడాల్సిందే.

వైరల్ అవుతున్న ఫోటోలో ఓ పిల్లాడు నేలపై పడుకుని డ్రాయింగ్ వేస్తున్నాడు. అతని చుట్టూ కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి. అయితే, ఆ వస్తువుల్లో పెద్ద తేడా ఉంది. దానిని కనిపెట్టి చెప్పాల్సింది మీరే. ఇందుకోసం 10 సెకన్లే సమయం. అవును, పది సెకన్లలో ఆ తప్పును మీరు కనిపెడితే.. మీ బ్రెయిన్, మీ కళ్లు చాలా షార్ప్‌గా పని చేస్తున్నాయని చెప్పొచ్చు.

ఏంటీ కనిపెట్టలేకపోయారా? అయితే ఇలా చూడండి..

పిల్లాడు నేలపై పడుకుని పెయింటింగ్ వేస్తున్నాడు. అతని పక్కన పెయింట్ బాక్స్, స్కెచ్‌లు పెట్టుకునే గ్లాస్, బుక్స్, వాటర్ గ్లాస్, తినేందుకు పండ్లు, ఆడుకునేందుకు కారు, ఫుట్‌బాల్, కారు, ప్లేన్, మరికొన్ని ఆట వస్తువులు ఉన్నాయి. పిల్లాడికి ఎడమ వైపున కిటీకి కూడా ఉంది. ఓపెన్ చేసిన కిటికీ, పరదాలు ఉన్నాయి. వాస్తవానికి ఫ్లోర్ మీద కిటికీ ఎలా ఉంటుంది? కిటికీ ఇంటికి సైడ్ గోడలకు ఉంటుంది. కానీ, ఇక్కడ ఫ్లోర్‌కి ఉంది. ఈ ఫోటోలో ఉన్న అతిపెద్ద మిస్టేక్ ఇదే.

Optical-Illusion-2.jpg

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 08 , 2024 | 05:05 PM