Viral Video: కూతురు తలపై సీసీ కెమెరా.. కారణమిదేనట..!
ABN , Publish Date - Sep 09 , 2024 | 09:02 AM
Viral News: ప్రస్తుతం అంతా సోషల్ మీడియాదే హవా నడుస్తోంది. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు జనాలు తమ మొబైల్‌లో సోషల్ మీడియాను యూజ్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా వీడియో షేరింగ్ యాప్స్‌ను విపరీతంగా చూసేస్తున్నారు. ఫేస్‌బుక్ రీల్స్, ఇన్‌స్టాగ్రమ్ రీల్స్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా..
Viral News: ప్రస్తుతం అంతా సోషల్ మీడియాదే హవా నడుస్తోంది. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు జనాలు తమ మొబైల్‌లో సోషల్ మీడియాను యూజ్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా వీడియో షేరింగ్ యాప్స్‌ను విపరీతంగా చూసేస్తున్నారు. ఫేస్‌బుక్ రీల్స్, ఇన్‌స్టాగ్రమ్ రీల్స్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా మాద్యమాల్లో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియో ప్రజలను బాగా ఆకట్టుకుంటాయి. అవే ట్రెండింగ్‌లో నిలుస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ రచ్చ చేస్తోంది.
సాధారణంగానే తల్లిదండ్రులు తమ పిల్లల రక్షణ విషయంలో కాస్త భయం భయంగా ఉంటారు. ఇక ఆడ పిల్లల విషయంలో ఈ భయం కాస్త ఎక్కువే ఉంటుంది. అందుకే.. తమ పిల్లలకు ఫోన్లు ఇచ్చి.. నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? ఎప్పుడొస్తారు? వంటి సమాచారాన్ని ఎప్పకటిప్పుడు అడిగి తెలుసుకుంటారు. ఇక ఈ మధ్య కాలంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. దీంతో తల్లిదండ్రుల తమ బిడ్డలను బయటకు పంపాలంటేనే జడుసుకుంటున్నారు.
భయట ఉన్న మానవ మృగాల భయమో.. మరే కారణమో గానీ.. ఓ తండ్రి తన కూతురు తలపై ఏకంగా సీసీ కెమెరాను ఫిక్స్ చేశాడు. తాను ఎక్కడున్నా తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుందని చెబుతున్నారు. సాధారణంగా భద్రతా ప్రయోజనాలు, ఇతర ప్రయోజనాల కోసం ఇంటి ఆవరణలో, షాప్స్, ఇతర ప్రదేశాల్లో అమర్చే సీసీ కెమెరాను.. ఓ వ్యక్తి తన కూతురు తలపై ఫిక్స్ చేయడంతో ఈ విషయం సెన్సేషన్‌గా మారింది.
ఇంతకీ అతను ఎందుకలా సీసీ కెమెరా పెట్టాడు.. ఈ ఘటన ఎక్కడ వెలుగు చూసింది? వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో పాకిస్తాన్‌కు చెందినదిగా తెలుస్తోంది. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో ఓ వ్యక్తి తన కూతురు తలపై సీసీ కెమెరా అమర్చాడు. 24/7 తన కూతురుని పర్యవేక్షించడానికి అతను సీసీ కెమెరాను అమర్చినట్లు చెబుతున్నారు. ఈ విషయంపై సదరు యువతి కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది. తన తండ్రి నిర్ణయంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. తాను సంతోషంగా ఉన్నానని మీడియాకు తెలిపింది. కూతురు ఎక్కడికి వెళ్తోంది? ఏం చేస్తోంది? క్షేమంగానే ఉందా? ఏమైనా సమస్య ఎదుర్కొంటోందా? అని తెలుసుకోవడానికి తన తండ్రి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని యువతి చెప్పుకొచ్చింది.
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. కేవలం 6 సెకన్లు ఉన్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. యువతికి సీసీ కెమెరా ఫిక్స్ చేయడంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇంకా ఏ కాలంలో ఉన్నార్రా బాబూ అని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.