Share News

Viral Video: ఆహా.. దర్జా అంటే ఇదీ.. కదులుతున్న లారీ వెనుక ఊయల కట్టుకుని ఎలా ఊగుతున్నాడో చూడండి..

ABN , Publish Date - Aug 31 , 2024 | 08:08 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటూ, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. రీల్స్ ద్వారా వైరల్ అయ్యేందుకు చాలా మంది స్వంతంగా వీడియోలు తీసుకుని పోస్ట్ చేస్తుంటారు.

Viral Video: ఆహా.. దర్జా అంటే ఇదీ.. కదులుతున్న లారీ వెనుక ఊయల కట్టుకుని ఎలా ఊగుతున్నాడో చూడండి..
Pakistani man lounges on hammock-cot on moving truck

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటూ, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. రీల్స్ (Reels) ద్వారా వైరల్ అయ్యేందుకు చాలా మంది స్వంతంగా వీడియోలు తీసుకుని పోస్ట్ చేస్తుంటారు. మరికొందరు తమకు ఆసక్తికరంగా అనిపించిన ఘటనలను కెమెరాలో బంధించి వాటిని పోస్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. పాకిస్తాన్‌ (Pakistan)లో ఈ వీడియోను చిత్రీకరించారు (Viral Video).


theoverseaspakistani అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి కదులుతున్న ట్రక్ (Truck) వెనుకాల భాగంలో మంచం లాంటి ఊయలపై దర్జాగా కూర్చున్నాడు. మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ ఫోన్ చూసుకుంటున్నాడు. బిజీ రోడ్డులో ఆహ్లాదకరంగా, దర్జాగా ఊయల ఊగుతూ ప్రయాణం చేస్తున్న అతడిని చుట్టు పక్కల వారు విచిత్రంగా చూశారు. ``మీరు పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు ప్రపంచంలో సమస్యలు లేనట్లు అనిపిస్తుంది`` అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. లక్ష మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``పాకిస్తాన్‌లో మాత్రమే ఇలాంటివి సాధ్యం``, ``పాకిస్తానీలు ఎక్కువ కష్టపడి తక్కువ సంపాదిస్తారు. అయినా సంతోషంగా ఉంటారు``, ``ప్రపంచంతో అతడికెలాంటి సంబంధమూ లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఏం తెలివి గురూ.. బైక్‌ను ఆటోలా మార్చి ఐదుగురిని తీసుకెళ్తున్నాడు.. జుగాడ్ వీడియో వైరల్..


Viral Video: అది చెయ్యా? ఉక్కు కడ్డీనా? ట్రాక్టర్ పైకి ఎక్కించుకుని ఆ వ్యక్తి చేసిన స్టంట్ చూస్తే షాకవ్వాల్సిందే..


Brain Teaser: మీ ఐక్యూ లెవెల్‌ను టెస్ట్ చేసుకోండి.. ఈ ఫ్రిడ్జ్‌లో ఉండకూడని 10 వస్తువులను కనిపెట్టండి..!


Viral Video: కిడ్నాపర్‌‌ను వదిలిరానని బాలుడి ఏడుపు.. బలవంతంగా అమ్మ దగ్గరకు చేర్చిన పోలీసులు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 31 , 2024 | 08:08 PM