Share News

Viral Video: ఇదెక్కడి మార్కెటింగ్ గురూ.. బరువు తగ్గించే యంత్రం గురించి ఎలా చెబుతున్నాడో చూస్తే నవ్వాపుకోలేం..

ABN , Publish Date - Jun 19 , 2024 | 05:06 PM

తమ వస్తువును ప్రమోట్ చేసుకోవడానికి ఉత్పత్తిదారులు, దుకాణదారులు రకరకాల మార్గాలను ఆశ్రయిస్తుంటారు. ఎలాగోలా తమ ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకోసం కొందరు అనుసరించే మార్గాలు మాత్రం చాలా విభిన్నంగా, ఫన్నీగా ఉంటాయి.

Viral Video: ఇదెక్కడి మార్కెటింగ్ గురూ.. బరువు తగ్గించే యంత్రం గురించి ఎలా చెబుతున్నాడో చూస్తే నవ్వాపుకోలేం..
Demo of weight-loss device

తమ వస్తువును ప్రమోట్ చేసుకోవడానికి ఉత్పత్తిదారులు, దుకాణదారులు రకరకాల మార్గాలను ఆశ్రయిస్తుంటారు. ఎలాగోలా తమ ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకోసం కొందరు అనుసరించే మార్గాలు మాత్రం చాలా విభిన్నంగా, ఫన్నీగా ఉంటాయి. తాజాగా పాకిస్తాన్‌ (Pakistan)కు చెందిన ఓ దుకాణదారు వెయిట్ లాస్ మెషిన్ (weight-loss device) గురించి ఇచ్చిన డెమో ఫన్నీగా ఉండి చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


businessbaatcheet అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో తన షాప్‌లో ఉన్న వెయిట్ లాస్ మెసేజర్ గురించి దుకాణదారుడు డెమో ఇస్తున్నాడు. దాని మీద వివిధ శరీర భాగాలను ఉంచి ఎలా మసాజ్ చేస్తోంది చూపిస్తున్నాడు. ఆ మెషిన్ కొవ్వును చాలా త్వరగా కరిగిస్తుందని, ఒక నెలలో పొట్ట (Belly Fat) తగ్గకపోతే ఆ మెషిన్‌ను వెనక్కి తిరిగి ఇచ్చెయ్యవచ్చని పేర్కొన్నాడు. శరీరంలోని ఏ భాగంలో కొవ్వు తగ్గించుకోవాలంటే ఆ భాగాన్ని మెషిన్‌పై ఉంచాలి. వైబ్రేటింగ్ మోడ్‌లో పని చేసే ఆ మెషిన్ చక్కగా కొవ్వును కరిగిస్తుందట.


ఆ మెషిన్ మీద వివిధ భంగిమల్లో కూర్చుని ఆ దుకాణదారుడు మాట్లాడుతున్న తీరు చూస్తే నవ్వు రాక మానదు. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఈ షాప్ ఉందట. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. 2 కోట్ల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``బరువు తగ్గడానికి ఇలాంటి షార్ట్‌కట్‌లను ఆశ్రయించకండి``, ``ఇది చూసి నేను 10 కిలోల బరువు తగ్గాను`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: తల్లిని కాపాడుకునేందుకు ఏనుగుతో తలపడేందుకు సిద్ధమైన గేదె పిల్ల.. ఏం జరిగిందో చూడండి..


Viral Video: ఇంత ట్యాలెంట్ ఉన్న అమ్మాయిని జైళ్లో పెట్టాలి.. యువతి ప్రమాదకర స్టంట్ చూస్తే షాకవ్వాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోెసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 19 , 2024 | 05:06 PM