Viral News: ఎగ్జామ్ పాస్ చేయండి, లేదంటే బ్రహ్మచారిగా మిగిలిపోతా.. టీచర్‌కు విద్యార్థి వింత విజ్ఞప్తి
ABN , Publish Date - Mar 29 , 2024 | 10:06 AM
ప్రతి ఏటా పరీక్షల్లో(exams) విద్యార్థులు చెప్పే వింత సమాధానాలు ప్రతిసారీ వార్తల్లో నిలుస్తున్నాయి. గతంలో కరోనా కారణంగా చదవలేకపోయానని, ఎగ్జామ్ పాస్(Pass the exam) చేయాలని పలువురు విద్యార్థులు(students) విజ్ఞప్తి చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రతి ఏటా పరీక్షల్లో(exams) విద్యార్థులు చెప్పే వింత సమాధానాలు ప్రతిసారీ వార్తల్లో నిలుస్తున్నాయి. గతంలో కరోనా కారణంగా చదవలేకపోయానని, ఎగ్జామ్ పాస్(Pass the exam) చేయాలని పలువురు విద్యార్థులు(students) విజ్ఞప్తి చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు మరికొంత మంది జ్వరం కారణంగా ఎగ్జామ్ సరిగా రాయలేకపోయానని, పేద కుటుంబం నుంచి వచ్చామని పాస్ చేయాలని కోరిన విజ్ఞప్తులు కూడా బహిర్గతమయ్యాయి. మరోవైపు తనకు పెళ్లి కుదురిందని, పాస్ కాకుంటే వివాహం రద్దు అవుతుందని పేర్కొంటూ ఓ విద్యార్థి చేసిన వింత విజ్ఞప్తిని కూడా చుశాం.
ఈ నేపథ్యంలో ఇటివల ఉత్తరప్రదేశ్(uttar pradesh)లోని మెయిన్‌పురి(mainpuri)లో 12వ తరగతి బోర్డు పరీక్ష మూల్యాంకనం జరుగుతోంది. ఆ క్రమంలో ఓ విద్యార్థి కోరిన వినూత్న విజ్ఞప్తి చూసిన ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయారు. 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి(student) ఇంటర్మీడియట్ ఇంగ్లీషు జవాబు పత్రంలో గురూజీ(teacher), దయచేసి నన్ను పాస్ చేయించాలని కోరారని వెల్లడించారు. అంతేకాదు లేకపోతే అతను బ్యాచిలర్‌గానే ఉంటానని ఓ లేఖలో పేర్కొన్నాడని చెప్పారు.
యూపీ బోర్డు(up board) పరీక్షలో 23941 ఉన్నత పాఠశాలలు, 18,653 ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం గురువారంతో పూర్తయింది. ప్రస్తుతం జిల్లాలో 19404 ఉన్నత పాఠశాలలు, 23518 ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకన పనులు మిగిలి ఉన్నాయని జిల్లా పాఠశాల ఇన్‌స్పెక్టర్ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Credit Cards: ఒక్కరోజే రూ.500 కోట్లు కోల్పోయిన క్రెడిట్ కార్డ్ యూజర్లు.. ఈ మోసం తెలుసా?