Indian Railways: రైల్లో ఒంటరిగా వెళుతున్న యువతి..తానున్న బోగీలో దృశ్యాన్ని అక్కకు వాట్సాప్‌లో షేర్ చేయడంతో..
ABN , Publish Date - Feb 19 , 2024 | 07:46 PM
రైల్లో తొలిసారిగా ఒంటరి ప్రయాణం చేస్తున్న ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది.
ఇంటర్నెట్ డెస్క్: రైల్లో తొలిసారిగా ఒంటరి ప్రయాణం చేస్తున్న ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. తన దీనిస్థితిని చెబుతూ ఆమె బోగీలోని సీన్‌ను ఫొటో తీసి అక్కకు పంపింది. చెల్లె పంపిన ఫొటోలను ఆమె సోదరి నెట్టింట పంచుకోవడంతో పెను కలకలమే రేగింది. చివరకు రైల్వే పోలీసులే రంగంలోకి దిగాల్సి వచ్చింది (Passengers occupy womans seat on train) .
VandeBharat: వందేభారత్ రైళ్లు ఎలా శుభ్రం చేస్తారో తెలుసా?
రైల్లో తన చెల్లెలికి ఎదురైన పరిస్థితి గురించి ఆ యువతి నెట్టింట వివరించింది. పరీక్షకు హాజరుకావాల్సి ఉండటంతో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిగా రైల్లో ప్రయాణించాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే, చివరి నిమిషంలో వారి టిక్కెట్ కన్ఫమ్ అయ్యింది, ఆ తరువాత మరో మూడు గంటలు లేటుగా రైలు స్టేషన్‌కు వచ్చింది. ఈ క్రమంలో యువతి చెల్లెలు తనకు కేటాయించిన సీటు వద్దకు వెళ్లేసరికే అక్కడ ఓ మధ్యవయసు వ్యక్తి తన కుటుంబంతో కూర్చున్నాడు. అతడికి అసలు టిక్కెట్టే లేదు. దీంతో, ఆమె తన సీటులోంచి లేవాలని చెప్పగానే అతడు గయ్యిమన్నాడు. యువతిపై ఇంతెత్తున ఎగిరిపడ్డాడు. దీంతో, ఆమె చేసేదేంలేక పైబెర్తుపై వెళ్లి కూర్చుంది. అప్పటికే అక్కడ మరో ఇద్దరు ఉండటంతో ఉన్నకొద్దిపాటి జాగాలోనే ఆమె సద్దుకోవాల్సి వచ్చింది.
Google Pune Office: గూగుల్‌లో జాబ్ కోసం ఎగబడేది ఇందుకే.. ఒక్కసారి వాళ్ల ఆఫీసుకు వెళితే..
ఈ విషయాలన్నీ యువతి తన అక్కతో పంచుకుంది. తనకు అనారోగ్యం కూడా మొదలైందని ఈ పరిస్థితిల్లో ఏం చేయాలో తోచట్లేదని వాపోయింది. చెల్లి మెసేజితో తల్లడిల్లిన అక్క ఆ స్క్రీన్ షాట్లను నెట్టింట షేర్ చేయడంతో ఇది పెద్ద కలకలానికి దారితీసింది. ఇది ‘రైల్ సేవ’ దృష్టికి కూడా వెళ్లడంతో అధికారులు వెంటనే స్పందించారు. రైల్వే పోలీసులు బోగిలోకి వెళ్లి అతడిని సీటు ఖాళీచేయించి యువతికి కేటాయించారు (Railways police help). యువతి సోదరి ఈ విషయాన్ని నెట్టింట పంచుకుంటూ మురిసిపోయింది. కేవలం 20 నిమిషాల్లోనే తమ సమస్య పరిష్కారమైందంటూ హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి