Viral: కొలను వద్దకు ఏనుగులను రానీయని మొసలి.. రాత్రీపగలు తేడా లేకుండా దాడులు!
ABN , Publish Date - Dec 29 , 2024 | 03:50 PM
ఓ మొసలి పగబట్టినట్టు రాత్రీ పగలూ తేడా లేకుండా ఏనుగులపై దాడికి తెగబడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ప్రకృతిలో కొన్ని వేటాడే జంతువులైతే మరికొన్ని ఇతర జీవాలకు ఆహారంగా మారుతుంటాయి. ఇతర జీవాలను వేటాడి కడుపునింపుకునే జంతువుల్లో మొసలి ముందుంటుంది. తనకంటే ముందు, తన తరువాత ఎన్నో జీవజాతులు పుట్టి అంతరించిపోయినా మొసలి మాత్రం ఇప్పటికే నిక్షేపంగా మనుగడ సాగిస్తోంది. ఇందుకు దాని శరీర నిర్మాణమే కారణం. నీళ్లల్లో ఉన్నంత వరకూ మొసలిని వేటాడగలిగే జంతువే లేదని చెప్పాలి. అయితే, తాజా వీడియోలో మాత్రం ఓ మొసలి మరింతగా రెచ్చిపోయింది. ఏనుగులపై అది తెగబడిన తీరు చూసి ప్రస్తుతం జనాలు విస్తుపోతున్నారు (Viral).
Viral: ఖతర్ యువరాణి తన ప్రేమలో పడిందనుకుని భార్యకు విడాకులు! చివరకు జైలుపాలు!
ఆఫ్రియాలో ఈ అసాధారణ దృశ్యం ఆవిష్కృతమైంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ సరస్సులో దాగున్న మొసలి నీటి సమీపానికి వచ్చిన ఏనుగుల మందలపై పదే పదే దాడి చేస్తూ నానా యాగీ చేసింది. ఏనుగుల మంద వచ్చిన ప్రతిసారీ వాటి తొండాలపై కరవడం మొదలెట్టింది. ఓ ఏనుగు తొండాన్ని గట్టిగా పట్టుకోవడంతో అది మొసలిని ఏకంగా నడిబయటకు లాక్కొచ్చింది. దాన్ని దాదాపుగా తొక్కినంత పనిచేసింది. తొండాన్ని మొసలి వదిలిపెట్టడంతో బతుకుజీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. మొసలి కూడా మళ్లీ నీళ్లల్లోకి వచ్చేంది. ఆ తరువాత వచ్చిన మరో ఏనుగుల మందను కూడా నీళ్లు తాగనీయకుండా తొండాలపై కరిచే ప్రయత్నం చేస్తూ తెగ విసిగించింది.
Viral: స్పోర్ట్స్ షూ వేసుకుని ఆఫీసుకు వచ్చినందుకు ఊస్టింగ్.. బాధితురాలికి రూ.32 లక్షల పరిహారం!
వీడియోలో ఇదంతా చూసిన జనాలు షాకైపోతున్నారు. ఈ మొసలికేమైందీ.. మనసులో కక్ష పెట్టుకున్నట్టు ఎందుకిలా పదే పదే ఏనుగలపై దాడికి తెగబడుతోంది అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. రాత్రి పగలూ తేడా లేకుండా నీటి వద్దకు వచ్చిన ఏనుగులను మొసలి భయభ్రాంతులకు గురి చేస్తున్న తీరు చూసి నోరెళ్లబెడుతున్నారు.
జంతుశాస్త్రవేత్తల ప్రకారం, ఉప్పునీటిలో కొన్ని మొసళ్లు ఉంటే మంచి నీటిలో మరికొన్ని మొసళ్ల జాతులు నివసిస్తుంటాయి. వీటిల్లో కొన్ని 20 అడుగుల పొడవు వరకూ పెరగగలవు. దాదాపు 70 ఏళ్ల పాటు జీవిస్తాయి. పదునైన పండ్లు, బలమైన దవడలు వీటి సొంతం. దీంతో, ఇవి నీటిలో ఉన్నప్పుడు భారీ జీవాలను సైతం నోటపట్టి ప్రాణాలు తీయగలవు. మొసళ్లను పోలిన జీవులు సుమారు 25 కోట్ల సంవత్సరాల క్రితం ఉనికిలోకి వచ్చాయి. 9.5 కోట్ల సంవత్సరాల క్రితం ఇవి ప్రస్తుతం మనం చూస్తున్న మొసళ్ల కింద రూపాంతరం చెందాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ విషయమై మరింత పరిశోధన జరగాల్సి ఉంది.