Viral: టీచర్ కష్టం చూసి జనాలు షాక్! ఈ సర్కస్ ఏంటంటూ విమర్శలు!
ABN , Publish Date - Dec 16 , 2024 | 03:20 PM
విద్యార్థులకు తమకు తెలిసి విషయాలన్నీ నేర్పాలని ఏ గురువైనా తాపత్రయపడతారు. తమ శక్తి మేరకు వారికి విషయాలు అర్థమయ్యేలా వివరిస్తారు. ఇదే ప్రయత్నం చేసిన ఓ టీచర్‌పై ప్రస్తుతం నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: తమకు తెలిసి విషయాలన్నీ విద్యార్థులకు నేర్పాలని ఏ గురువైనా తాపత్రయపడతారు. తమ శక్తి మేరకు వారికి విషయాలు అర్థమయ్యేలా వివరిస్తారు. ఇదే ప్రయత్నం చేసిన ఓ టీచర్‌పై ప్రస్తుతం నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది (Viral).
Viral: కోటీశ్వరుడిగా మారడంపై ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్ స్పందన ఏంటంటే..
ఎడ్ టెక్ వేదిక ఫిజిక్స్‌వాలా యూట్యూబ్ ఛానల్‌లో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులకు రసాయన శాస్త్రం బోధించే క్రమంలో చాలా కష్టపడ్డారు. రసాయన శాస్త్రంలో అణువులకు ఉండే ముఖ్యమైన గుణాల్లో ఖైరాలిటీ ఒకటి. సింపుల్‌గా చెప్పాలంటే.. రెండు చేతులకు ఉండే లక్షణం అన్నమాట. ఈ లక్షణం కారణంగానే ఒక చేతికి వేసుకునే గ్లోవ్ రెండో చేతికి పట్టదు. మాలిక్యూల్స్‌లో కూడా ఇదే గుణం ఉంటుందని చెప్పేందుకు సదరు టీచర్ విశ్వప్రయత్నమే చేశారు. ఇందులో భాగంగా.. ఆయన స్వయంగా టేబుల్‌పైకి ఎక్కి తన శీర్షాసనం వేసి మరీ పాఠాన్ని బోధించే ప్రయత్నం చేశారు. ఇదంతా యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్‌లో అందరూ చూడస్తుండగా చేశారు. టీచర్ కష్టం చూసి విద్యార్థులు ఒక్కసారిగా షాకైపోయారు. ఈ దృశ్యాల్ని నెట్టింట షేర్ చేసిన ఓ నెటిజన్ ఇదంతా మరీ నాటకీయంగా ఉందని కామెంట్ చేశారు.
Viral: అందంగా ఉన్నందుకు పార్టీకి రావద్దంటూ నిషేధం! మహిళకు షాకింగ్ అనుభవం
కాగా, ఈ వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఆ టీచర్ నిబద్ధతను కొందరు మెచ్చుకుంటే మరికొందరు విమర్శించారు. ఆధునిక సాంకేతిక సాయంతో త్రీడీ మోడల్స్ వినియోగించి ఇదే విషయాన్ని బోధించొచ్చు కదా అని ఓ వ్యక్తి చెప్పారు. కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో చేసిన మోడల్స్ అనేకం అందుబాటులో ఉన్నాయని కొందరు చెప్పుకొచ్చారు. సర్కస్ షో చూస్తున్నట్టు ఉందని కొందరు, యోగా క్లాస్‌లో ఉన్నట్టు ఉందని మరికొందరు కామెంట్ చేశారు. ‘‘టీచర్‌ను నిబద్ధత ఎక్కువైనా అయ్యి ఉండాలి లేదా ఇదేమైనా పబ్లిసిటీ స్టంట్ అయ్యి ఉండాలి’’ అని కొందరు కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది. జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తుంది. మరి ఈ ఆసక్తికర వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Viral: వామ్మో.. ఈ అడల్ట్ డైపర్స్ ధర రూ.6 వేలు! ఎందుకో తెలిస్తే..
Viral: వామ్మో! టెస్లా రూపొందించిన ఈ మనిషి లాంటి రోబోను చూశారా..