Pineapple: పైనాపిల్ గురించి అవాక్కయ్యే నిజాలు.. తియ్యగా ఉన్న పైనాపిల్ ఎలా సెలెక్ట్ చెయ్యాలంటే..!
ABN , Publish Date - Oct 02 , 2024 | 06:06 PM
పైనాపిల్ గురించి ఈ నిజాలు తెలుసా? తియ్యని పైనాపిల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే..
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఒక్కో రకం పండులో ఒక్కో విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సిట్రస్ జాతికి చెందిన పండ్లలో పైనాపిల్ కూడా ఒకటి. ఇది పుల్లగానూ, తియ్యగానూ చాలా రుచిగా ఉంటుంది. సాధారణంగా మార్కెట్లో పైనాపిల్ కొనుగోలు చేసేటప్పుడు తియ్యగా ఉన్న పైనాపిల్ కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చి కట్ చేసిన తరువాత అవి పుల్లగా ఉండటం చాలామందికి అనుభవంలోకి వచ్చి ఉంటుంది. అయితే పైనాపిల్ ను చిన్న టెక్నిక్ తో తియ్యగా ఉన్నది సెలక్ట్ చేసుకోవచ్చు. పైనాపిల్ గురించి కొన్ని ఆసక్తికర నిజాలు.. పైనాపిల్ సెలెక్షన్ గురించి తెలుసుకుంటే..
మార్భర్గ్ వైరస్.. కరోనా, మంకీ పాక్స్ కంటే ఇదెంత డేంజరంటే..!
పైనాపిల్ రకాలు..
పైనాపిల్ లో కూడా రకాలు ఉంటాయా అని ఆశ్చర్యపోకండి. పైనాపిల్ లో క్వీన్, కింగ్ అని రెండు రకాలు ఉంటాయట. ఈ రెండింటిని పైనాపిల్ ఆకుల సహాయంతో గుర్తించవచ్చు.
పైనాపిల్ పైన కిరీటంలా ఉన్న ఆకులను గమనించాలి. ఆకుపచ్చగా ఉండి చాలా ఎక్కువ ఆకులు ఉన్న పైనాపిల్ ను కింగ్ అని అంటారు. అదే విధంగా తక్కువ ఆకులు ఉన్న పైనాపిల్ ను క్వీన్ అని అంటారు.
కింగ్ పైనాపిల్ చూడటానికి చాలా ఆకర్షణగా ఉంటుంది. దీన్ని జ్యూస్ షాపులు, పండ్ల దుకాణాలలో ఆకర్షణ కోసం బయటకు కనిపించేలా పెడతారు. కానీ ఈ పైనాపిల్ పుల్లగా ఉంటుంది.
తియ్యని పైనాపిల్ ను ఆస్వాదించాలని అనుకుంటే క్వీన్ పైనాపిల్ ను ఎంచుకోవాలి. ఇది జ్యూసీగా, తియ్యగా ఉంటుంది. ఈ పైనాపిల్ పైన కిరీటంలా ఉన్న ఆకులు కింగ్ పైనాపిల్ కంటే తక్కువగా , చిన్నగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి..
10గ్రాముల బంగారం ధర లక్ష దాటుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..!
గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.