Share News

Viral: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన పోలీసుకు భారీ షాక్! ఈ పొరపాటు చేయొద్దు!

ABN , Publish Date - Dec 16 , 2024 | 05:02 PM

దేశంలో ఆన్‌లైన్ స్కాములు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని పోలీసుల సైబర్ విభాగాలు హెచ్చరిస్తుంటాయి. అయితే, తాజా ఉదంతంలో ఏకంగా ఓ పోలీసే సైబర్ స్కామ్ బారినపడ్డారు.

 Viral: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన పోలీసుకు భారీ షాక్! ఈ పొరపాటు చేయొద్దు!

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఆన్‌లైన్ స్కాములు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని పోలీసుల సైబర్ విభాగాలు హెచ్చరిస్తుంటాయి. అయితే, తాజా ఉదంతంలో ఏకంగా ఓ పోలీసే సైబర్ స్కామ్ బారినపడ్డారు. క్యూర్ కోడ్ స్కాన్ చేసినందుకు రూ.2.3 లక్షలు పోగొట్టుకున్నారు (Viral).

Viral: మరో మహిళ భర్త కోసం రూ.1.39 కోట్లు చెల్లించి.. చివరకు రిఫండ్ కోసం పట్టు


జాతీయ మీడియా కథనాల ప్రకారం, పూణెలోని సస్వాద్‌లో ఉండే సదరు కానిస్టేబుల్ ఇటీవల స్థానిక బేకరీలో ఏవో ఐటమ్స్ కొనుగోలు చేశారు. క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లిద్దామనుకున్నారు. అక్కడే ఉన్న కోడ్‌ను స్కాన్ చేయాలన్న షాపులోని సిబ్బంది సూచనను పాటించారు. ఆ కొద్ది క్షణాలకే ఆయన ప్రమేయం లేకుండానే తన బ్యాంకు అకౌంట్లో నుంచి రూ.18,755 డెబిట్ అయినట్టు ఫోన్‌కు మెసేజీ వచ్చింది. దీంతో, ఆయన దిమ్మెరపోయారు. కంగారులో ఇతర బ్యాంక్ అకౌంట్లలో అమౌంట్‌ను చెక్ చేసుకుంటూ ఉండగా మరో రూ.12,250 డెబిట్ అయినట్టు రెండో మెసేజీ వచ్చింది. చివరకు ఆయన శాలరీ అకౌంట్‌లో రూ.50 మిగిలాయి. ఈ క్రమంలోనే మరోసారి ఆయన సెల్‌ఫోన్‌కు ఓటీపీ రావడం, దాన్ని కానిస్టేబుల్ ఎవరికీ చెప్పకపోయినా మరో రూ.1.9 లక్షలు బదిలీ అయిపోవడంతో బాధితుడు లబోదిబోమన్నాడు. చివరకు తన అకౌంట్లు స్తంభింపచేయడంతో హ్యాకర్ల ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. క్రెడిట్ కార్డు ద్వారా మరో రూ.14వేలు బదిలీ చేయాలనుకున్న వారి ప్రయత్నం బెడిసికొట్టింది.

Viral: టీచర్ కష్టం చూసి జనాలు షాక్! ఈ సర్కస్ ఏంటంటూ విమర్శలు!


కాగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హ్యాకర్లు ఏపీకే ఫైల్ ద్వారా బాధితుడి ఫోన్‌ను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. హ్యాకర్లు పంపించిన లింక్‌ను బాధితుడు తెలీక పొరపాటున క్లిక్ చేయడంతో మాల్‌వేర్ చొరబడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మాల్‌వేర్ సాయంతోనే వారు మొబైల్ సెక్యూరిటీని దాటుకుని లాగిన్ వివరాలు, ఓటీవీ వంటి సున్నితమైన వివరాలను పొందగలిగారని అనుమానిస్తున్నారు. కాగా, బాధితుడు తనకు తెలీకుండా ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేసుకునేలా క్యూఆర్ కోడ్‌లోనే ఏమైనా మార్పులు చేశారా? లేక ఇతర మార్గాల్లో మోసానికి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Viral: కోటీశ్వరుడిగా మారడంపై ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్ స్పందన ఏంటంటే..

Viral: అందంగా ఉన్నందుకు పార్టీకి రావద్దంటూ నిషేధం! మహిళకు షాకింగ్ అనుభవం

Read Latest and Viral News

Updated Date - Dec 16 , 2024 | 05:07 PM