Viral: భర్తంటే ఎంత ప్రేమ తల్లి.. తాను పుట్టింటికి వెళితే భర్తకు ఇబ్బందని మాస్టర్ ప్లాన్.. ఏం చేసిందో తెలిస్తే అవాక్కవడం ఖాయం!
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:24 PM
గర్భిణీ స్త్రీలు సాధారణంగా కష్టమైన పనులు చేయరు. నెలలు నిండే కొద్దీ వారి పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. చివరి నెలలో వారు నడవడం కూడా కష్టమవుతుంది. అయితే జపాన్‌కు చెందిన ఓ మహిళ ఆ సమయంలో కూడా తన పరిస్థితిని పట్టించుకోకుండా భర్త కోసమే ఆలోచించింది.
గర్భిణీ స్త్రీలు (Pregnant Woman) సాధారణంగా కష్టమైన పనులు చేయరు. నెలలు నిండే కొద్దీ వారి పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. చివరి నెలలో వారు నడవడం కూడా కష్టమవుతుంది. అయితే జపాన్‌కు (Japan) చెందిన ఓ మహిళ ఆ సమయంలో కూడా తన పరిస్థితిని పట్టించుకోకుండా భర్త (Husband) కోసమే ఆలోచించింది. నెల రోజుల పాటు తాను అందుబాటులో ఉండలేదు కాబట్టి.. 30 రోజులకు సరిపడా ఆహారాన్ని సిద్ధం చేసి ఫ్రీజర్‌లో ఉంచింది (Food for 30 days). ఆ విషయాన్ని ఆ మహిళ భర్త సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆమెపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు (Viral News).
జపాన్‌కు చెందిన ఓ 30 ఏళ్ల మహిళ మే నెల 21వ తేదీన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం తర్వాత నెల రోజుల పాటు ఆమె పుట్టింట్లో ఉంటోంది. ఆ నెల రోజులూ భర్త భోజనానికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఆమె మాస్టర్ ప్లాన్ వేసింది. డెలివరీకి ముందే నెల రోజులకు సరిపడా భోజనం వండేసి దానిని ఫ్రీజర్‌లో ఉంచింది. తన భార్య చేసిన పని గురించి భర్త సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. దీంతో నెటిజన్లు ఆమె భర్తపై విమర్శలు ప్రారంభించారు.
``ఇది చాలా అమానవీయం. 9వ నెలలో భార్య అంత పని చేసేందుకు ఎలా అనుమతించారు``, ``ఆమె తన భర్తను చిన్న పిల్లాడిలా చూసుకుంటోంది``, ``ఆ భర్త చాలా క్రూరుడు``, ``ఇలా చేయడం ఇద్దరికీ మంచిది కాదు``, ``ఇలా చేయాల్సిన అవసరం ఏముంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: తెలివి అంటే ఇదీ.. ఈ ఇటుక కూలర్ ముందు ఏసీ కూడా బలదూర్.. ఎలా సెట్ చేశాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..