Pregnant Woman's: గర్భిణీ స్త్రీలు ఈ రెండు పనులు చేస్తే చాలు.. పండంటి పాపాయి పుట్టడం ఖాయం..!
ABN , Publish Date - May 29 , 2024 | 02:19 PM
ఆడవారి జీవితంలో గర్భధారణ దశ చాలా అపురూపమైనది. గర్భిణి స్త్రీలు పుట్టబోయే బిడ్డ గురించి చాలా కలలు కంటూ ఉంటారు ఈ సమయంలో. ప్రతి గర్భిణి తనకు పుట్టే బిడ్డ చక్కగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. దీనికి తగినట్టే ఆహారం దగ్గర నుండి అలవాట్ల వరకు ఎన్నో మార్చుకుంటుంది. అయితే పుట్టే బిడ్డ మంచి గుణవంతుడు, బుద్దివంతుడిగా పుట్టాలంటే రెండు పనులు తప్పనిసరిగా చేయాలట.
ఆడవారి జీవితంలో గర్భధారణ దశ చాలా అపురూపమైనది. గర్భిణి స్త్రీలు పుట్టబోయే బిడ్డ గురించి చాలా కలలు కంటూ ఉంటారు ఈ సమయంలో. ప్రతి గర్భిణి తనకు పుట్టే బిడ్డ చక్కగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. దీనికి తగినట్టే ఆహారం దగ్గర నుండి అలవాట్ల వరకు ఎన్నో మార్చుకుంటుంది. అయితే పుట్టే బిడ్డ మంచి గుణవంతుడు, బుద్దివంతుడిగా పుట్టాలంటే రెండు పనులు తప్పనిసరిగా చేయాలని శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారో తెలుసుకుంటే..
సంగీతం..
సంగీతం వింటే గర్భిణీ స్త్రీ లకు చాలా మంచిదట. ముఖ్యంగా పడుకునే ముందు వాయిద్య సంగీతం వినడం వల్ల గర్భంలో ఉండే బిడ్డ మెదడు ఆరోగ్యంగా అభివృద్ది చెందుతుంది. దీంతో గర్భిణీ స్త్రీలకు కూడా రిలాక్స్ గా ఉంటుంది. మూడవ నెల నుండి సంగీతాన్ని కడుపులో బిడ్డ వినగలుగుతుంది. సంగీతంలో శాస్త్రీయ సంగీతం, లాలిపాటలు, మెలోడీలు మొదలైనవి వినవచ్చు.
పిల్లలు చిన్నతనం నుంచే బాధ్యతగా ఉండాలంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!
అదేవిధంగా గర్భిణీ స్త్రీలు భయానక చిత్రాలు, హింసను కలిగిన సన్నివేశాలు చూడకూడదు. భయపెట్టే విషయాలకు దూరంగా ఉండాలి.
ఆకుపచ్చ రంగు..
గర్భిణీ స్త్రీలు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం చాలా మంచిదట. ఆకుపచ్చ రంగు పుట్టుకకు చిహ్నమట. భూమిలో మొలకెత్తే విత్తనం ఆకుపచ్చ రంగులోనే ఎదుగుతుంది. అందుకే గర్భధారణ సమయం కూడా భూమితో ముడిపడి ఉంటుందట. ఇంతే కాదు ఆకుపచ్చ రంగు బలం, ఆరోగ్యకరమైన పెరుగుదలను కడుపులో బిడ్డకు కలిగిస్తుంది. అందుకే గర్భిణీలు ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకోవడం, తమ చుట్టూ ఆకుపచ్చ రంగు ఉండేలా చూసుకోవడం మంచిదని అంటున్నారు. అదే విధంగా గర్భిణులు ఎరుపు, బూడిద రంగులకు దూరం ఉండటం మంచిదట.
పిల్లలు చిన్నతనం నుంచే బాధ్యతగా ఉండాలంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!
కాలేయం డ్యామేజ్ అయితే కనిపించే లక్షణాలు ఇవీ..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.