Share News

Viral: బ్యాంకు మేనేజర్ దగా! లోన్ ఆశ పెట్టి రూ.39 వేల నాటు కోళ్లు స్వాహా!

ABN , Publish Date - Dec 09 , 2024 | 07:12 PM

ఛత్తీస్‌గఢ్‌లో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. లోన్ మంజూరు చేస్తానని ఆశపెట్టిన బ్యాంకు మేనేజర్ తనను మోసం చేశాడంటూ స్థానిక రైతు ఫిర్యాదు చేశాడు.

Viral: బ్యాంకు మేనేజర్ దగా! లోన్ ఆశ పెట్టి రూ.39 వేల నాటు కోళ్లు స్వాహా!

ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. లోన్ మంజూరు చేస్తానని ఆశపెట్టిన బ్యాంకు మేనేజర్ తనను మోసం చేశాడంటూ స్థానిక రైతు ఫిర్యాదు చేశాడు. తాను తెచ్చిచ్చిన రూ.39 వేల విలువైన నాటుకోళ్లను తినేశాడని ఆరోపించాడు. మస్తురీ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది (Viral).

వామ్మో.. మనుషులను శుభ్రపరిచే వాషింగ్ మెషీన్!


బాధితుడు రూప్‌చంద్ మహర్ తెలిపిన వివరాల ప్రకారం, అతడు ఓ కోళ్ల వ్యాపారం చేస్తుంటాడు. తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలన్న ఉద్దేశంతో లోన్ కోసం స్థానిక ఎస్బీఐ మేనేజర్‌ను సంప్రదించాడు. అదే తన తప్పైందని బాధితుడు వాపోయాడు. 12 లక్షల లోన్ కావాలని కోరానని చెప్పాడు. మేనేజర్ కోరినట్టు లోన్ కోసమని ముందస్తుగానే 10 శాతం కమిషన్ కింద చెల్లించానని కూడా చెప్పాడు. అంతేకాకుండా, ప్రతి శనివారం నాటు కోడి కూర కావాలని మేనేజర్ కోరితే తాను సప్లై చేశానని వాపోయాడు. ఇందుకు సంబంధించిన బిల్లులు కూడా ఎప్పటికప్పుడు మేనేజర్‌కు ఇస్తూ వచ్చానని అన్నాడు. ఇన్ని నాటు కోళ్లు తిన్నాక కూడా లోన్ మంజూరు కాకపోవడంతో మోసపోయానని గుర్తించినట్టు చెప్పుకొచ్చాడు. నాటు కోళ్ల డబ్బు కూడా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

Copper Toxicity: రాగి పాత్రలో నీటిని తాగుతారా? ఈ జాగ్రత్త పాటించకపోతే నీరు విషతుల్యం!


మేనేజర్ తీరుతో విసిగిపోయిన రూప్‌చంద్ చివరకు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశాడు. మేనజర్‌పై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు తాను అతడికి ఇచ్చిన డబ్బు, నాటు కొళ్లపై ఖర్చుపెట్టిన మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని అభ్యర్థించాడు. అధికారులు సరైన చర్యలు తీసుకోని పక్షంలో తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని, ఎస్‌బీఐ బ్రాంచ్‌ ముందు పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుంటానని పేర్కొన్నారు. దీంతో, ఈ ఉదంతం స్థానికంగా పెను కలకలానికి దారి తీసింది.

Contagious Yawning: ఒకరిని చూసి మరొకరు ఆవలిస్తారు! ఎందుకో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Dec 09 , 2024 | 08:29 PM