Share News

Viral: పబ్‌లో నూతన సంవత్సర వేడుకలు.. అతిథులకు కండోమ్స్‌ గిఫ్ట్‌గా పంపి ఆహ్వానాలు!

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:55 PM

పూణెలో న్యూఇయర్ పార్టీ ఏర్పాటు చేసిన ఓ పబ్ తమ అతిథులకు ఆహ్వాన పత్రంతో పాటు కండోమ్స్‌ కూడా పంపించింది. ఈ ఉదంతంపై ఒక్కసారిగా కలకలం రేగడంతో చివరకు పార్టీ క్యాన్సిల్ అయ్యింది.

Viral: పబ్‌లో నూతన సంవత్సర వేడుకలు.. అతిథులకు కండోమ్స్‌ గిఫ్ట్‌గా పంపి ఆహ్వానాలు!

ఇంటర్నెట్ డెస్క్: నేటి రాత్రి యావత్ ప్రపంచం నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలనుంది. అందరూ పార్టీలకు సిద్ధమైపోయారు. అంతటా పార్టీ మూడ్ కనిపిస్తోంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక పబ్‌లు, రెస్టారెంట్లు కూడా నూతన వేడుకలకు సిద్ధమైపోయాయి. తమ కస్టమర్లను ఉర్రూతలూగించేందుకు శక్తి వంచన లేకుండా, ఖర్చుకు వెనకాడకుండా ఏర్పాట్లు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ పబ్ తీరు కలకలానికి దారితీసింది. దీనిపై ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది (Viral).

మహారాష్ట్రలోని హైస్పిరిట్స్ క్లబ్ నూతన సంవత్సర వేడుకను ఏర్పాటు చేసింది. పబ్‌ను తరచూ సందర్శించే ఓ 40 మంది అతిథులకు ప్రత్యేక ఆహ్వానాలతో పాటు ఓ సూచన కూడా చేసింది. ఈ వేడుకకు బైక్‌పై వచ్చే వారు హెల్మెట్లు పెట్టుకురావాలని, డ్రంకెన్ డ్రైవ్‌కు దిగొద్దని సూచించింది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా సూచిస్తూ తగినంత తీరు తాగాలని చెప్పింది. అయితే, వీటితో పాటు అతిథులకు ఓ గిఫ్ట్ బ్యాగ్‌ కూడా పంపించింది. ఇందులో అధికారిక ఆహ్వాన పత్రంతో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్, కండోమ్ ప్యాకెట్లు, స్వీట్లు కూడా ఉన్నాయి.

New Year Celebrations: ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో ఫూల్స్ అవుతారు.. జర జాగ్రత్త


ఓ కస్టమర్ వీటిని తీసి నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కండోమ్స్ పంపించడం ఏంటని, అసలేం జరుగుతోందోని కొందరు ప్రశ్నించారు. ఇలా రచ్చ పీక్స్‌కు చేరడంతో సదరు పబ్‌కు పోలీసులు నోటీసులు పంపించారు.

నెట్టింట విమర్శలు ఎక్కువైపోవడంతో చివరకు ఆ పబ్ న్యూ ఇయిర్ పార్టీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ తరువాత కండోమ్స్ పంపించడానికి అసలు కారణం వివరిస్తూ పబ్ మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Viral: నీటి ప్రవాహాన్ని దాటేందుకు వంతెన నిర్మించిన చీమలు! వైరల్ వీడియో!


‘‘సదుద్దేశంతో తాము చేసిన సూచనను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కొందరు యువత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుంటారు. తాగి వాహనాలు నడపడం, అరక్షిత శృంగారం వంటికి చర్యలకు దిగుతారు. వేడుకల సంబరంలో తమ చర్యల పర్యవసానాలను పట్టించుకోరు. కాబట్టి, ఈ సారి బాధ్యతాయుతంగా పార్టీ చేసుకోవాలని అనే సందేశంతో కూడిన థీమ్‌ను ఎంచుకున్నాం. ఇందుకు తగ్గట్టుగా ఆహ్వానాలు పంపించాము’’ అని వివరణ ఇచ్చింది.

మరోవైపు, ఘటనపై రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కూడా స్పందించారు. ఇలాంటి చీప్ పబ్లిసిటీని అస్సలు ఆమోదించమని స్పష్టం చేశారు. ‘‘మేము పబ్ సంస్కృతి, నైట్ లైఫ్‌కు వ్యతిరేకం కాదు. కానీ ఇలాంటి చీప్ పబ్లిసిటీని మాత్రం కచ్చితంగా ఖండిస్తాము. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాము. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆశిస్తున్నాము’’ అని ఆయన పేర్కొన్నారు.

Read Latest and Viral News

Updated Date - Dec 31 , 2024 | 02:03 PM