Share News

Viral: వామ్మో.. ఇది రావణ దహనమా..అణుబాంబు విస్ఫోటనమా! షాకింగ్ సీన్స్

ABN , Publish Date - Oct 14 , 2024 | 08:58 PM

ఇటీవల ఓ రావణ దహన కార్యక్రమంలో షాకింగ్ దృశ్యాలు వైరల్‌గా మారాయి. మంటలు అంటుకున్న రావణుడి ఒక్కసారిగా అణు బాంబు విస్ఫోటనాన్ని తలపించేలా పేలిపోవడం పలువురిని షాక్‌కు గురి చేస్తోంది.

Viral: వామ్మో.. ఇది రావణ దహనమా..అణుబాంబు విస్ఫోటనమా! షాకింగ్ సీన్స్

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా జరుపుకునే పెద్ద పండగల్లో దసరా ముఖ్యమైంది. విశేష ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న ఈ పండుగను హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇక దసరా వేడుకల్లో ప్రాంతాల వారీగా కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో తరతరాలుగా వస్తున్న ఆచారావ్యవహారాలను పాటిస్తుంటారు. అయితే, దసరా సందర్భంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో రావణ దహన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా రావణ దహన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో అసాధారణ దృశ్యాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

Viral: ఈ టిక్కెట్ ఎక్కడ దొరుకుతుంది.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్


తాజా వీడియోలో జనాలు హర్షాతిరేకాలు, జయజయధ్వానాల మధ్య ఈ వేడుకను ప్రారంభించారు. ఓ ఖాళీ మైదానంలో రావణుడి భారీ దిష్టిబొమ్మను ఏర్పాటు చేశారు. ఓ వ్యక్తి వీటికి దూరంగా నిలబడి రావణ బొమ్మపైకి పెద్ద బాణం వేశాడు. అయితే, మంటలు రాజుకున్న కొద్ది సేపటికే ఆ బొమ్మ భారీ శబ్దం చేస్తూ పేలిపోయింది. ఏదో అణువిస్ఫోటనం జరిగినట్టు పుట్టగొడుగు ఆకారంలో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ బీభత్సం చూసి జనాలు షాకైేపోయారు.

Viral: 15 ఏళ్లుగా లాటరీ టిక్కెట్ల కొనుగోలు! ఎట్టకేలకు అదృష్టం కలిసొచ్చి..


ఇక నెట్టింట కూడా ఈ వీడియో కలకలం రేపుతోంది. ఇంతలా మంటలు ఎగసిపడటానికి కారణం ఏమై ఉంటుందో అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. మరి ఈ షాకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Read Latest and Viral News

Updated Date - Oct 14 , 2024 | 09:08 PM