Tea Drinking Habit: ప్రతి రోజూ టీ తాగేవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు
ABN , Publish Date - Nov 16 , 2024 | 06:44 PM
టీ తాగేవారు తెలియక కొన్ని తప్పులు చేస్తు్ంటారని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించే ఈ పొరపాట్లు ఏవంటే..
ఇంటర్నెట్ డెస్క్: కొందరికి రోజూ టీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయాన్నే కడుపులో టీ పడకపోతే కొందరికి మంచం దిగబుద్ధి కాదు. అయితే, టీ తాగేవారు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించే ఈ పొరపాట్లు (Health) ఏవంటే..
ఉదయాన్నే పరగడుపున టీ తాగితే ఎసిడిటీ వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో, కడుపులో ఇబ్బంది మొదలవుతుంది. ఉదయాన్నే వేడి వేడి టీ తాగే వారిలో ఈ సమస్య మరింత అధికమవుతుందట. కొన్ని సందర్భాల్లో ఇది కడుపు, డియోడినమ్‌లో అల్సర్స్‌కు దారి తీసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
Health: వేడి నీటి స్నానాలతో ఈ సమస్యలు ఉన్నాయని తెలుసా?
ఇక కొందరికి భోజనం చేశాక టీ తాగే అలవాటు ఉంటుంది. ఇది కూడా ఇబ్బంది కారకమేనట. టీలో టానిన్స్, ఫైటేట్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఆహారంలోని ఐరన్‌ను శరీరం పీల్చుకోకుండా ఇవి అడ్డుపడతాయి.
ఇక సాయంత్రాలు లేటుగా టీ తాగే వారిలో రాత్రిళ్లు నిద్రపట్టకపోయే సమస్య వచ్చే అవకాశం ఉంది. టీలో థియోఫిలిన్స్ అనే ఉత్తేజకారక రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఉత్తేజితం చేసి రాత్రి నిద్రకు దూరం చేస్తాయి.
Health: రాత్రి లేటుగా నిద్రపోయి మర్నాడు తెల్లవారుజామునే లేస్తున్నారా! అయితే..
ఇక రోజులో పలుమార్లు టీ తాగే వారిలో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎసిడిటీ, నిద్రలేమి, ఐరన్ లోపం తోపాటు పేగుల ఆరోగ్యం కూడా దెబ్బతినొచ్చని అంటున్నారు. అధికసార్లు టీ తాగే అలవాటున్న వారిలో ఇది టాకీఎరిత్మియాకు దారితీయొచ్చట. ఇలాంటి వారిలో బీపీ తరచూ ఎగుడుదిగుడలయ్యే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
ఇక ప్లాస్టిక్ కప్పులో వేడి వేడి టీ తాగడమూ ప్రమాదకరమే. ఇలాంటి సందర్భల్లో కప్పుల్లోని బీపీఏ అనే విషపూరిత పదార్థాలు టీలో కలుస్తాయి. బీపీఏతో హార్మోన్ల సమతౌల్యం దెబ్బతింటుందట. కాబట్టి, టీని ఇష్టపడే వారు పింగాణి కప్పుల్లో తాగడమే బెటరని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా టీ తాగాలనుకుంటే సాయంత్రం స్నాక్స్ తినే సమయంలో తాగితే ఎటువంటి ఇబ్బందులు దరి చేరకుండా ఉత్సాహంగా ఉండగలుగుతారని చెబుతున్నారు. ఇక సాధారణ టీతో పాటు గ్రీన్ టీ లాంటివి తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
Recall Method: ఈ టెక్నిక్ ఫాలో అయితే మతిమరుపుపై శాశ్వత విజయం!
Beer: బీర్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి! లేకపోతే..