Share News

Relationship: మీరు ఈ 5 తప్పులు ఎప్పుడూ చేయకండి.. నేటి కాలం జంటలు తొందరగా విడిపోవడానికి ఇవే కారణం..!

ABN , Publish Date - Jul 24 , 2024 | 10:04 AM

పెళ్లికి ముందు, పెళ్లైన కొత్తలో భాగస్వామి కంటే ఏదీ ఎక్కువ కాదు అనుకున్నవారు కాస్తా విడాకులు తీసుకుని విడిపోయే వరకు వెళుతున్నారు. అయితే ఇలా కొత్త జంటలు చాలా తొందరగా విడిపోవడానికి 5 విషయాలే కారణాలని..

Relationship: మీరు ఈ  5 తప్పులు ఎప్పుడూ చేయకండి.. నేటి కాలం జంటలు తొందరగా విడిపోవడానికి ఇవే కారణం..!
Husband-Wife Relation

పెళ్లంటే నూరేళ్లు పంట అంటారు. జీవింతాంతం కలసి ఉండేది భార్యాభర్తలే.. అయితే నేటికాలంలో మాత్రం పెళ్లిళ్లు చేసుకున్న రోజులు, నెలల వ్యవధిలోనే విడిపోతున్నారు. పెళ్లికి ముందు, పెళ్లైన కొత్తలో భాగస్వామి కంటే ఏదీ ఎక్కువ కాదు అనుకున్నవారు కాస్తా విడాకులు తీసుకుని విడిపోయే వరకు వెళుతున్నారు. అయితే ఇలా కొత్త జంటలు చాలా తొందరగా విడిపోవడానికి 5 విషయాలే కారణాలని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో.. అవి భార్యాభర్తల బంధాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకుంటే..

Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ తన జుట్టుకు రంగు వేయరు ఎందుకు? తన చీరకట్టు గురించి ఆమె వేసిన పంచ్ ఏంటంటే..!



కమ్యూనికేషన్..

కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం భార్యాభర్తల బంధంలో చాలా పెద్ద గొడవలు సృష్టిస్తుంది. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడే విధానం, చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పే విధానం కీలకపాత్ర పోషిస్తుంది. ఇది కొన్నిసార్లు భార్యాభర్తలు విడిపోవడానికి కూడా కారణం అవుతుంది.

దూరం..

భార్యాభర్తలు ఎక్కువ కాలం దూరం ఉండటం కూడా వారి బంధాన్నిచిక్కుల్లోకి నెట్టేస్తుంది. దూరంగా ఉండటం వల్ల ఇద్దరూ కలసి నిర్ణయాలు తీసుకోవడం, భవిష్యత్తు గురించి ఇద్దరూ కలసి ప్లాన్ చేసుకోవడం, ఒకరి పట్ల మరొకరు తమ ప్రేమను ప్రత్యక్షంగా వ్యక్తం చేసుకునే అవకాశం లేకపోవడం కారణం అవుతాయి.

భావోద్వేగాలు..

భార్యాభర్తల మధ్య ఎమోషనల్ కనెక్షన్ ఉన్నప్పుడే వారు కలసి ఉండగలరు. అదే ఎమోషన్ కనెక్షన్ లేకుంటే ఎక్కువ కాలం కలసి ఉండలేరు. ఇద్దరి మనసులు దగ్గరగా ఉండటం ఎంతో అవసరం.

ఈ కెరాటిన్ ఫుడ్స్ తింటే చాలు.. జుట్టు రాలడం ఆగిపోతుంది..!


డబ్బు..

డబ్బు అన్ని సంబంధాలను విచ్చిన్నం చేసినట్టే భార్యాభర్తలను కూడా విడదీస్తుంది. డబ్బు సంపాదన, ఖర్చు, పొదుపు ఇంటి అవసరాల కోసం సర్థుబాటు చేసుకోవడం వంటి విషయాలు ఇద్దరి మధ్య విబేధాలను సృష్టిస్తాయి. ఇవి గొడవలకు, అటు నుంచి విడిపోవడానికి దారితీస్తాయి.

నమ్మకం..

భార్యాభర్తల బంధం నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది. నమ్మకమే బంధానికి పునాది అవుతుంది. ఒకరికొకరు నమ్మకం ఇచ్చుకోలేకపోతే ఇద్దరి మధ్య అనుమానాలు వస్తూనే ఉంటాయి. అది ఏదో ఒక సందర్బంలో పెద్ద గొడవలకు దారి తీసి విడిపోవడానికి కారణం అవుతుంది.

పాదాలు, మడమల్లో ఈ లక్షణాలు ఉంటే చక్కెర స్థాయిలు ఎక్కువున్నట్టే..!

వర్షాకాలంలో ఈ కాంబినేషన్ ఫుడ్స్ అస్సలు తినకండి..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 24 , 2024 | 10:04 AM