Share News

Viral: బాలుడి గుండె నిబ్బరానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. అతడి ఫోన్ నెంబర్ కావాలంటూ ట్వీట్!

ABN , Publish Date - May 06 , 2024 | 04:12 PM

ఢిల్లీకి చెందిన ఓ10 ఏళ్ల బాలుడు తండ్రి పోయాక కుటుంబం కోసం ఫుడ్ స్టాల్ నడుపుకుంటున్న వైనం ఆనంద్ మహీంద్రాను ఆకర్షించింది. బాలుడి చదువు కుంటుపడకుండా తాను సాయం చేస్తానంటూ ఆయన ముందుకొచ్చారు.

Viral: బాలుడి గుండె నిబ్బరానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. అతడి ఫోన్ నెంబర్ కావాలంటూ ట్వీట్!

ఇంటర్నెట్ డెస్క్: ఆ బాలుడి పేరు జస్‌ప్రీత్.. వయసు జస్ట్ 10 ఏళ్లు. ఆటపాటలతో ఆహ్లాదంగా గడవాల్సిన బాల్యం. కానీ విధి కాటేయడంతో చిన్నవయసులోనే కుటుంబ బాధ్యతలు భుజాన వెసుకోవాల్సి వచ్చింది. ముక్క పచ్చలారని వయసులోనే అతడు ఫుడ్ స్టాల్ నడుపుతూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. తండ్రి ఈలోకాన్ని వీడినా బాలుడు మనసు చిక్కపట్టుకుని ధైర్యంగా జీవితంలో ముందడుగు వేశాడు (Anand Mahindra promises to help Delhi boy managing food stall after father’s death).

ఢిల్లీలో తన తండ్రికి ఉన్న చిన్న ఫుడ్ స్టాల్ నడుపుకుంటున్న జస్‌ప్రీత్ గురించి ఓ వ్లాగర్ తొలిసారిగా నెట్టింట పంచుకున్నాడు. పదేళ్ల చిరుప్రాయంలో అతడిపై బరువుబాధ్యతల భారం పడిందంటూ వ్లాగర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తండ్రి నుంచి రోటీలు చేయడం నేర్చుకున్న జస్‌ప్రీత్ తన అక్క, మరో బంధువుతో కలిసి వ్యాపారాన్ని నిర్వహిస్తు కుటుంబభారాన్ని మోస్తున్నాడని చెప్పాడు. చూస్తుండగానే ఈ ఉదంతం వైరల్‌గా (Viral) మారింది. ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) అంతటి వ్యక్తినే కదిలించింది. దీంతో, ఆయన బాలుడి వీడియో రీట్వీట్ చేస్తూ అతడి వివరాల కావాలంటూ నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.

Sweat Rice balls: అందమైన యువతుల చంకలోని చెమటతో ఘుమఘుమలాడే డిష్.. తెగ తింటున్న జనాలు!


‘‘ఇతడు జస్‌ప్రీత్.. ధైర్యానికి ప్రతిరూపం. కానీ బరువు బాధ్యతలతో చిన్నారి చదవు కుంటుపడకూడదు. అతడు తిలక్ నగర్‌లో ఉంటున్నాడని నేను అనుకుంటున్నాను. అతడి కాంటాక్ట్ నెంబర్ ఉంటే చెప్పండి. బాలుడి చదువు విషయం మహీంద్రా ఫౌండేషన్ టీం చూసుకుంటుంది’’ అని ఆయన నెట్టింట అభ్యర్థించారు.

జనాలను జస్‌ప్రీత్ ఉదంతం కదిలించింది. చిన్న వయసులోనే బాధ్యతలకు వెరవని బాలుడి తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. బాలుడిని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఆనంద్ మహీంద్రాను కుడా జనాలు తెగ పొగిడేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యామని చిన్నారి గురించి ప్రపంచానికి తెలిసిందని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య చిన్నారి ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది.

Read Viral and Telugu News

Updated Date - May 06 , 2024 | 04:58 PM