Viral: తల లేకుండా 18 నెలలు బతికిన కోడి.. తన ఓనర్‌కు కోట్లు ఎలా సంపాదించి పెట్టిందంటే..
ABN , Publish Date - Nov 12 , 2024 | 01:20 PM
ఎనభయ్యేళ్ల క్రితం క్రితం అమెరికాలో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే షాక్ అయిపోతారు. అమెరికాలోని కొలరాడోలో ఒక కోడి తల లేకపోయినా ఏకంగా ఏడాదిన్నర పాటు జీవించింది. అంతేకాదు చనిపోయే ముందు తన యజమానిని కోటీశ్వరుడిని చేసింది.
తల (Head) లేకుండా బతకడం ఏ జంతువుకూ సాధ్యం కాదు. మనుషులకే కాదు.. ఇతర జీవులకు కూడా మెదడు (Brain) తల భాగంలోనే ఉంటుంది. మెదడు లేకపోతే శరీరంలోని జీవ క్రియలు సజావుగా సాగవు. అయితే 80 సంవత్సరాల క్రితం అమెరికాలో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే షాక్ అయిపోతారు. అమెరికా (America)లోని కొలరాడోలో ఒక కోడి తల లేకపోయినా ఏకంగా ఏడాదిన్నర పాటు జీవించింది (Headless Chicken). అంతేకాదు చనిపోయే ముందు తన యజమానిని కోటీశ్వరుడిని చేసింది. ఆ విచిత్రమైన కోడిని అందరూ ``మైక్ ది హెడ్‌లెస్ చికెన్``, ``మిరాకిల్ మైక్`` అని పిలిచేవారు (Viral Video).
కొలరాడోకు చెందిన లాయిడ్ ఓస్లెన్ అనే వ్యక్తి పౌల్ట్రీ ఫామ్ యజమాని. లాయిడ్ ఒకసారి తన ఇంట్లో పార్టీ కోసం మైక్ అనే కోడిని కోశాడు. అయితే కోసిన వెంటనే దానిని బాక్స్‌లో పెట్టకుండా పక్కన వదిలేశాడు. తల లేకపోయినా ఆ కోడి లేచి నడిచి, పరిగెత్తడం ప్రారంభించింది. తల నరికేసినా ఆ కోడి బతకడానికి కారణమేంటంటే.. లాయిడ్ కత్తితో నరికినప్పుడు ఆ కోడి తల ముందు భాగం మాత్రమ కట్ అయింది. తలలోని ముఖ్యమైన నరాలు, చెవులు తెగిపోలేదు. అలాగే మెదడుకు పెద్దగా నష్టం జరగలేదు. రక్తం గడ్డకట్టి రక్తస్రావం ఆగిపోయింది. అందుకే కోడి చనిపోలేదు. ఆ కోడి మీద జాలిపడిన లాయిడ్ దానిని చంపడం మానేశాడు. దానికి చికిత్స చేసి జాగ్రత్తగా చూసుకున్నాడు (Headless Miracle Chicken).
లాయిడ్ ఆ కోడికి పాలు, మొక్కజొన్నగింజలు ఆహారంగా ఇచ్చేవాడు. దాంతో ఆ కోడి తల లేకుండా ఏకంగా 18 నెలలు బతికే ఉంది. అయితే చివరకు ఓ మొక్క జొన్న గింజ గొంతులో ఇరుక్కుపోవడంతో ఆ కోడి చనిపోయింది. చనిపోయే ముందు తన యజమాని లాయిడ్‌ను మిలియనీర్‌ను చేసింది. తల లేకుండా బతుకుతున్న కోడి గురించి అందరికీ తెలిసి దానిని చూడడానికి వచ్చేవారు. ఆ క్రమంలో ఓ ఎంటర్‌టైన్మెంట్ సంస్థతో లాయిడ్ భారీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ కోడితో పలు ప్రదర్శనలు ఇచ్చేవాడు. ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. అలా మిలియన్ డాలర్లకు పైగా సంపాదించాడు. తల లేకుండా అత్యధిక కాలం బతికిన కోడిగా కూడా మైక్ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం.. ప్లేట్‌లో వడ్డించిన చేప ఎలా నడిచిందో చూడండి..
Shocking: డ్రైవర్ చేసిన చిన్న తప్పు.. భారీ మూల్యం చెల్లించిన ఓనర్.. ఒడిశాలో ఏం జరిగిందో తెలిస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి