Viral Video: వామ్మో.. రీల్స్ పిచ్చి ఇలా ఉంటుందా? వీడియో కోసం చీర కాల్చుకుంది.. చివరకు ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Nov 12 , 2024 | 09:33 AM
చాలా మంది రీల్స్ కోసం ఎన్నో పిచ్చి పనులు చేస్తున్నారు. ఆ క్రమంలో తామే ప్రమాదాలకు గురవుతున్నారు. లేదా ఇతరులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ప్రస్తుతం రీల్స్ (Reels) రూపొందించడం అనేది ఓ పెద్ద వ్యాధిలా మారిపోయింది. రీల్స్ కోసం ఎన్నో పిచ్చి పనులు చేస్తున్నారు. ఆ క్రమంలో తామే ప్రమాదాలకు గురవుతున్నారు. లేదా ఇతరులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఓ మహిళ వీడియో కోసం తన చీరకు (Saree) నిప్పు (Fire) అంటించుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది (Viral Video).
@sk90official అనే ట్విటర్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ ఓ షెడ్లో ఉన్న పొయ్యి దగ్గరకు వెళ్లి తన చీరను మంటల్లో వేసింది. ఆ చీరకు నిప్పు అంటుకోగానే గట్టిగా కేకలు వేసింది. అయితే క్షణాల్లో ఆ మంటలు పెద్దగా అయిపోయాయి. ఆమె అరుపులు విని చుట్టుపక్కల వాళ్లు పరిగెత్తుకుని వచ్చారు. ఆమె వెంటనే తన శరీరం మీద చీరను విప్పి పడేసింది. ఆ ఘటన మొత్తాన్ని ఓ వ్యక్తి కెమేరాతో వీడియో తీస్తున్నాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.3 లక్షల మందికి పైగా వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది పిచ్చికి పరాకాష్ట``, ``రీల్స్ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడుతున్నారు``, ``అది వెబ్ సిరీస్ షూటింగ్``, ``వీళ్లను సైకియాట్రిస్ట్కు చూపించాలి``, ``రీల్స్ పిచ్చి అనేది అత్యంత భయంకర రోగం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం.. ప్లేట్లో వడ్డించిన చేప ఎలా నడిచిందో చూడండి..
Shocking: డ్రైవర్ చేసిన చిన్న తప్పు.. భారీ మూల్యం చెల్లించిన ఓనర్.. ఒడిశాలో ఏం జరిగిందో తెలిస్తే..
Viral Video: ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. తక్కువ ఖర్చుతో రూమ్ హీటర్ ఎలా తయారు చేశాడంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి