Viral News: మీకు మొత్తం 4 వేలయ్యింది.. సర్‌ఛార్జీలు ఎక్స్‌ట్రా.. షాక్‌లో కస్టమర్
ABN , Publish Date - Mar 17 , 2024 | 04:12 PM
సాధారణంగా ఏదైనా హోటల్ కానీ రెస్టారెంట్‌కి గానీ వెళ్లినప్పుడు అక్కడ అయ్యే ఖర్చు మనకు తెలిసిందే. రెస్టారెంట్ కల్పించే సౌకర్యాలు తదితర అంశాలు ఫుడ్ ధరలో వ్యత్యాసాలకు కారణమవుతాయి. అలాంటిది తిన్నది తక్కువైతే.. బిల్లు బారేడు వేస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైంది.
డార్విన్: సాధారణంగా ఏదైనా హోటల్ కానీ రెస్టారెంట్‌కి గానీ వెళ్లినప్పుడు అక్కడ అయ్యే ఖర్చు మనకు తెలిసిందే. రెస్టారెంట్ కల్పించే సౌకర్యాలు తదితర అంశాలు ఫుడ్ ధరలో వ్యత్యాసాలకు కారణమవుతాయి. అలాంటిది తిన్నది తక్కువైతే.. బిల్లు బారేడు వేస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైంది. రెండు చపాతీలు, రెండు కాఫీలకు ఓ రెస్టారెంట్ రూ.4 వేల బిల్లు వేసింది. దాన్ని చూసిన బాధితుడు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.
ఏమైందంటే..
డార్విన్‌లోని ఓ బీచ్‌సైడ్ రెస్టారెంట్‌లో ఒకతను రెండు రోల్స్, రెండు కాఫీలు ఆర్డర్ చేశాడు. దానికి కాంబినేషన్‌గా అవకాడో, ఐస్ క్రీమ్‌లు అందించారు. కస్టమర్ తిన్న తరువాత బిల్లు తీసుకొచ్చారు. ఆ బిల్లు చూసి కస్టమర్ ఒక్క క్షణం షాక్‌కి గురయ్యాడు. ఫుడ్ ఐటమ్స్‌కి సర్‌ఛార్జ్‌లు కలిపి మొత్తం బిల్లు రూ.4 వేలు వేశారు.
ఆహార ఖరీదు కంటే అందులో సర్‌ఛార్జీలే ఎక్కువగా ఉన్నాయని తెలియడంతో కస్టమర్ ఖంగుతిన్నాడు. ఆహారం బాగున్నప్పటికీ అంత బిల్లు వేయడమేంటని ఆవేదన వ్యక్తం చేశాడు. తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. నెటిజన్లు సైతం బిల్లు చూసి షాక్ తిన్నారు. తమకూ ఇలాంటి అనుభవాలు ఉన్నాయని కామెంట్లు చేశారు.