Viral: సిబ్బంది కళ్లుకప్పి విమానమెక్కిన మహిళ.. బాత్రూమ్‌లల్లో కూర్చుని జర్నీ!
ABN , Publish Date - Dec 06 , 2024 | 11:32 AM
టిక్కెట్టు లేని ఓ మహిళ భద్రతా సిబ్బంది కళ్లుకప్పి విమానమెక్కిన బాత్రూమ్‌లో కూర్చుని జర్నీ చేసిన ఉదంతం అమెరికాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇలా దొంగచాటుగా అమెరికా నుంచి ఫ్రాన్స్‌కు చేరుకున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టిక్కెట్టు లేని ఓ మహిళ భద్రతా సిబ్బంది కళ్లుకప్పి విమానమెక్కి, బాత్రూమ్‌లో కూర్చుని జర్నీ చేసిన ఉదంతం అమెరికాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. దొంగచాటుగా అమెరికా నుంచి ఫ్రాన్స్‌కు చేరుకున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని అమెరికాకు తిరిగి పంపించారు. నిందితురాలిని రష్యాకు చెందిన స్వెత్లానా డాలీగా (57) గుర్తించారు (Viral).
Elon Musk: భవిష్యత్తులో ఆ దేశం అంతరించిపోతుంది.. ఎలాన్ మస్క్ హెచ్చరిక
స్థానిక మీడియా కథనాల ప్రకారం, నవంబర్ 26న నిందితురాలు డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ డీఎల్264 లోకి దొంగచాటుగా ప్రవేశించింది. బోర్డింగ్ పాస్, టిక్కెట్టు వంటివేవీ లేకుండా విమానమెక్కిన ఆమె ఫ్రాన్స్‌లోని డిగాల్ ఎయిర్‌పోర్టులో దిగింది. తొలుత ఆమె జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇతర ప్రయాణికులతో కలిసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది ఆమెను గుర్తించారు. టిక్కెట్ లేకపోవడంతో తిప్పి పంపించారు. ఆ సమయంలో ఐరోపా ఫ్లైట్‌కు చెందిన సిబ్బంది అనేక మంది మరో మార్గంలో లోపలికి వెళుతుండగా వారి మధ్య నక్కి లోపలికి వెళ్లిపోయింది. తనిఖీలు తక్కువగా ఉండే ఈ లైన్ కేవలం వైమానిక సిబ్బంది కోసం ఉద్దేశించినది. ఇతర ప్రయాణికులతో సిబ్బంది బిజీగా ఉండటం గమనించిన ఆమె సిబ్బంది వెంట లోపలికి వెళ్లిపోయినట్టు తెలిసింది.
Google Tracking: మీ లొకేషన్‌ను గూగుల్ ట్రాక్ చేయొద్దని కోరుకుంటున్నారా? ఇలా చేస్తే సరి
విమానంలో ఆమెకంటూ ఎటువంటి సీటు లేకపోవడంతో టాయిలెట్లల్లో కూర్చుని ప్రయాణించేందుకు ప్రయత్నించిన ఆమెను సిబ్బంది గుర్తించి బోర్డింగ్ పాస్ కోరడంతో ఆమె బండారం బయటపడింది. ఆమె ఫ్రాన్స్‌లో దిగగానే స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత ఆమెను మరో విమానంలో అమెరికాకు తిరిగి పంపించారు. మరోవైపు న్యాయస్థానం ఆమెకు శుక్రవారం వరకూ రిమాండ్ విధించింది. ఆమె బెయిల్ కోసం కొంత మొత్తం కట్టి, నివాస ధ్రువీకరణ పత్రం చూపెడితే బెయిల్ మంజూరు చేసేందుకు అంగీకరించింది.
హాలీడే సీజన్‌లో మహిళ రద్దీని ఆసరాగా చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా విమానం ఎక్కడం అమెరికాలో సంచలనంగా మారింది. జేఎఫ్‌కే ఎయిర్‌పోర్టులో భద్రతా ఏర్పాట్లపై చర్చ మొదలైంది. కాగా, ఈ ఘటనకు మునుపు మహిళ అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐపై కోర్టుకెక్కింది. తనను రష్యా ప్రభుత్వం తన మాజీ భర్తకు 20 వేల డాలర్లకు అమ్మేసిందని ఆమె తన వ్యాజ్యంలో పేర్కొంది.
Elon Musk: భారత్‌లో ఒకే రోజులో 640 మిలియన్ ఓట్లు లెక్కించారు! మస్క్ ప్రశంసలు