Share News

Digital arrest: పోలీసుకు పొరపాటున వీడియో కాల్ చేసిన సైబర్ నిందితుడు! చివరకు..

ABN , Publish Date - Nov 15 , 2024 | 05:45 PM

డిజిటల్ అరెస్టు పేరిట డబ్బులు దండుకునేందుకు ఓ సైబర్ నేరగాడు పొరపాటున పోలీసు అధికారికి ఫోన్ చేసి అడ్డంగా బుక్కైపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Digital arrest: పోలీసుకు పొరపాటున వీడియో కాల్ చేసిన సైబర్ నిందితుడు! చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: డిజిటల్ అరెస్టు పేరిట డబ్బులు దండుకునేందుకు ఓ సైబర్ నేరగాడు పొరపాటున పోలీసు అధికారికి ఫోన్ చేసి అడ్డంగా బుక్కైపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కేరళ పోలీసులు షేర్ చేసిన ఈ వీడియో (Viral) చూసి జనాలు పడీ పడీ నవ్వుకుంటున్నారు.

Viral: అసలైన ప్రేమంటే ఇదీ.. చూపు లేని గర్ల్‌ఫ్రెండ్‌కు ఊహించని సర్‌ప్రైజ్

ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరిట మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. అయితే, నేరగాళ్లు మాత్రం అమాయకులను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజా ఘటనలో ఓ క్రిమినల్ పొరపాటున సైబర్ పోలీసుకు వీడియో కాల్ చేశాడు. ఖాకీ దుస్తులు ధరించిన నిందితుడు..తాను మాట్లాడుతోంది ఓ పోలీసు అధికారితో అని తెలీక ఆయన్ను డిజిటల్ అరెస్టు పేరిట భయపెట్టే ప్రయత్నం చేశాడు. అధికారి ముఖం పూర్తిగా కనబడేలా కెమెరా తిప్పుకోమని సూచించాడు.


Viral: ఏంటీ.. ఇది భారతీయ ఎయిర్‌పోర్టా! జపాన్ యువతి షాక్!

అతడు చెప్పినట్టే పోలీస్ ఆఫీసర్ చేయడంతో నిందితుడు స్క్రీన్‌పై కనబడ్డ దృశ్యం చూసి అవాక్కయ్యాడు. పూర్తి యూనిఫాంలో స్క్రీన్‌పై కనిపిస్తున్న ఆఫీసర్‌ను చూడగానే నిందితుడికి నోట మాట రాలేదు. అతడి పరిస్థితి చూసి పడీపడీ నవ్వుకున్న అధికారి నిందితుడికి గుండెల్లో రైళ్ల పరిగెత్తేలా వార్నింగ్ ఇచ్చాడు. ఇది సైబర్ సెల్ అని, అతడు ఫోన్ చేసింది ఓ పోలీసు అధికారికని చెప్పడమే కాకుండా, అతడి ఫోన్ నెంబర్, లోకేషన్ కూడా దొరికిపోయిందని చెప్పాడు. ఇది విన్న నిందితుడికి ముఖంలో నెత్తురు చుక్కలేనట్టు పాలిపోయింది. ఈ పని మానేయ్.. మేం వస్తున్నాం అనగానే నిందితుడికి చేతులూకాళ్లు ఆడలేదు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట నవ్వులు పూస్తున్నాయి.

Viral: ఎంత మోసం.. మంచానపడ్డ భర్తకు సేవలు చేసి కోలుకునేలా చేస్తే..


కాగా, గతనెలలో సైబర్ నేరగాళ్లు గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తిని డిజిటల్ అరెస్టు, ఆర్థిక అవకతవల పేరిట భయపెట్టి డబ్బు గుంజేందుకు ప్రయత్నించారు. అయితే, వారి స్కామ్‌ను ముందే పసిగట్టిన వ్యక్తి.. నిందితుల వీడియో కాల్ మొత్తాన్ని రికార్డు చేశాడు. ఇలాంటి స్కామ్‌ల బారిన పడకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీడియోలను నెట్టింట పంచుకున్నారు. అప్పట్లో ఈ ఉదంతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. కాగా, అనుమానాస్పద లేదా తెలియని నెంబర్ల నుంచి ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు వెంటనే ఈ విషయాన్ని తమకు తెలియజేయాలని పోలీసులు చెబుతున్నారు.

Viral: ప్రసవ సమయంలో డాక్టర్ల పొరపాటు.. 18 ఏళ్లుగా మహిళకు నరకం

Read Latest and Viral News

Updated Date - Nov 15 , 2024 | 05:52 PM