Share News

Indian Railways: రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఆఫర్లు.. చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఆ స్కీమ్‌లు ఏంటంటే..

ABN , Publish Date - Sep 28 , 2024 | 01:00 PM

ప్రతిరోజు కొన్ని కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చే భారతీయ రైల్వే వ్యవస్థ ప్రయాణికుల కోసం ఎన్నో ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంటుంది. 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులను, 58 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలను రైల్వే వ్యవస్థగా సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తుంది.

Indian Railways: రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఆఫర్లు.. చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఆ స్కీమ్‌లు ఏంటంటే..
Indian Railways

ప్రతిరోజు కొన్ని కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చే భారతీయ రైల్వే (Indian Railway) వ్యవస్థ ప్రయాణికుల కోసం ఎన్నో ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంటుంది. 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులను, 58 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలను రైల్వే వ్యవస్థగా సీనియర్ సిటిజన్లు (Senion Citizens)గా పరిగణిస్తుంది. సీనియర్ సిటిజన్ల భద్రత కోసం ఇండియన్ రైల్వే ఎప్పటికప్పుడు అనేక స్కీమ్‌లు ప్రకటిస్తుంటుంది. అయితే వృద్ధ ప్రయాణికులకు అందుబాటులో ఉన్న అనేక సౌకర్యాల గురించి చాలా మందికి తెలియదు. అవేంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


భారతీయ రైల్వేలో రిజర్వ్‌డ్ కోచ్‌లలో లోయర్, మిడిల్, అప్పర్ బెర్త్‌లు ఉంటాయనే సంగతి తెలిసిందే. రిజర్వేషన్ సమయంలో వృద్ధ ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా ప్రాతిపదికన దిగువ బెర్త్‌లను (Lower Berth) కేటాయిస్తుంది. మహిళల విషయంలో 45 ఏళ్లు దాటితే ఈ సౌకర్యం కల్పిస్తుంది. ఒకవేళ రిజర్వేషన్ చేసే సమయంలో లోయర్ బెర్త్ అందుబాటులో లేకుంటే, రైలులో ప్రయాణిస్తున్న సమయంలో సీనియర్ సిటిజన్ టీటీఈని కలిసి లోయర్ బెర్త్ కావాలని అడగవచ్చు. కొన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత, టీటీఈ వారికి లోయర్ బెర్త్‌ను కేటాయిస్తారు.


నిబంధనల ప్రకారం అన్ని రైళ్లలో ఒక్కో స్లీపర్ కోచ్‌లో ఆరు లోయర్ బెర్త్‌లను సీనియర్ సిటిజన్ల కోసం కేటాయిస్తారు. సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్‌లలో కూడా మూడేసి లోయర్ బెర్త్‌లను వృద్ధ ప్రయాణికులకు కేటాయించారు. దేశంలోని ముంబై, కోల్‌కతా మరియు చెన్నై వంటి నగరాల్లో రైల్వే లోకల్ రైళ్లు నడుస్తుంటాయి. ఈ లోకల్ రైళ్లు, మెట్రో రైళ్లలో కూడా సీనియర్ సిటిజన్ల కోసం సీట్లను కేటాయించారు. దేశంలోని ప్రధాన స్టేషన్లలో సీనియర్ సిటిజన్లకు వీల్ చైర్, పోర్టర్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నిర్ణీత రుసుము చెల్లించి ఈ సౌకర్యాలను సీనియర్ సిటిజన్లు వాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి..

Viral: ఏం క్రియేటివిటీ బాసూ.. క్లాస్‌లో పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీయడానికి ఎలాంటి టెక్నిక్ వాడారో చూడండి..


Viral Video: వామ్మో.. ఇదెక్కడి సర్‌ప్రైజ్ రా బాబూ.. బర్త్‌డే విషెస్ పేరుతో ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్‌కు నిప్పు.. తర్వాతేం జరిగిందంటే..


IQ Test: మీ ఐక్యూ ఏ స్థాయిలో ఉందో టెస్ట్ చేసుకోండి.. ఈ ముగ్గురిలో బాస్ ఎవరో కనిపెట్టండి..


Viral Video: వామ్మో.. చీమ కూడా ఇంతలా భయపెడుతుందా? జర్మన్ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో చూస్తే షాకవ్వాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Sep 28 , 2024 | 01:00 PM