Viral: కారులో డాష్‌క్యామ్ పెట్టుకోండి.. ఇలాంటి మహిళ ఎదురైతే యమా డేంజర్
ABN , Publish Date - Aug 30 , 2024 | 09:38 AM
కావాలని కారు కింద పడి నానా యాగీ చేసేందుకు ప్రయత్నించిన ఓ మహిళ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇలాంటి వాళ్ల బండారం బయటపెట్టాలంటే కారులో డ్యాష్‌కామ్ పెట్టాలంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను షేర్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కావాలని కారు కింద పడి నానా యాగీ చేసేందుకు ప్రయత్నించిన ఓ మహిళ వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. ఇలాంటి వాళ్ల బండారం బయటపెట్టాలంటే కారులో డ్యాష్‌కామ్ పెట్టాలంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను షేర్ చేశారు. నెటిజన్ సూచనతో కొందరు ఏకీభవిస్తే మరికొందరు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
Viral: భారతీయ మగాళ్లను ఎంత మాట అనేశాడు.. అమెరికన్ షాకింగ్ కామెంట్స్ వైరల్
బెంగళూరులో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఓ వ్యక్తి కారుకు ఎదురొచ్చిన ఓ మహిళ అతడు తప్పించబోయినా కారును ఢీకొట్టి యాక్సిడెంట్ అయినట్టు నాటకమాడే ప్రయత్నం చేసింది. అయితే, కారులోని డ్యాష్‌బోర్డు కెమెరాలో ఇదంతా రికార్డవడంతో పెద్ద ముప్పే తప్పింది. తొలుత సదరు మహిళ రోడ్డుకు అడ్డంగా నిలబడిన విషయాన్ని దూరం నుంచే డ్రైవర్ గమనించాడు. కారు వేగం తగ్గించి ఆమె పక్క నుంచి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ మహిళ మాత్రం కావాలని కారు మీద పడి యాక్సిడెంట్ అయినట్టు చూపించే ప్రయత్నం చేసింది. ఆ తరువాత అతడివైపు చూస్తూ ఉన్మాదిలా సైగలు చేసింది (Shocking Dashcam Video From Bengaluru Shows Woman Faking Car Accident).
ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి.. కారులో తప్పనిసరిగా డ్యాష్ కామ్ పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి మహిళలు తారసపడితే ప్రమాదమని హెచ్చరించారు. మహిళకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిస్తే వీధిన పోయే వాళ్లందరూ ముందూవెనకా చూసుకోకుండా డ్రైవర్‌ను తప్పుబడతారని హెచ్చరించారు. ఏ సమయంలో ఏం జరుగుతోందో తెలీదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
మరోవైపు ఈ ఉదంతం నెట్టింట వైరల్ కావడంతో జనాలు షాకైపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోతాయని కొందరు కామెంట్ చేశారు. జనాల్ని ట్రాప్ చేసి డబ్బులు లాగేందుకు కొందరు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుంటారని అన్నారు. మరికొందరు మాత్రం ఘటనపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళకు మతిస్తిమితం లేకపోయి ఉండొచ్చని, ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.