Eclipse 2024: ఈ ఏడాది రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఎప్పుడెప్పుడంటే...!
ABN , Publish Date - Jan 04 , 2024 | 04:17 PM
ఈ సంవత్సరానికి రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు రానున్నాయి. ఇవి సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వెళుతున్నప్పుడు మూడు గ్రహాలు ఒకే కక్షలో ఉన్నప్పుడు సంభవిస్తాయట. సూర్యుడు భూమి నీడను చంద్రుని పై వేసినపుడు చంద్రగ్రహణం జరుగుతుంది. ఒకే సరళరేఖ మీద ఇవి కనిపిస్తాయి.

2024లో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు అంటే..
ఈ సంవత్సరంలో సూర్యగ్రహణం ఏఫ్రియల్ 8న ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణంగా ఉత్తర అమెరికాను దాటుతుంది. మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, కెనడా మీదుగా ఉంటుంది. ఈ సూర్యగ్రహణాన్ని చూసేటప్పుడు ప్రత్యేకమైన కంటి రక్షణ చర్యలు తీసుకోవాలని NASA తెలిపింది.
2024లో రెండో సూర్యగ్రహణం
రెండో సూర్యగ్రహణం ఆక్టోబర్ 2న రాబోతుంది. ఇది అమావాస్య రోజున కావడం విశేషం.
ఇది కూడా చదవండి: చలికాలంలో ఈ మొక్కలను చీడపీడల నుంచి ఎలా కాపాడుకోవాలంటే..!
2024 మొదటి చంద్ర గ్రహణం..
చంద్రగ్రహణం మార్టి 25న రానుంది. ఇది యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర, తూర్పు ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ లలో కనపిస్తుంది.
2024లో రెండో చంద్ర గ్రహణం
ఇది సెప్టెంబర్ 18న ఉంటుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర, పశ్చిమ ఉత్తర అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటికాలోని ప్రజలు చూడచ్చు. ఈ గ్రహణాలేవీ భారతదేశంలో కనిపించవు.