Snake Handling Tips: పాము ఇంట్లోకి వస్తే పొరపాటున కూడా ఈ పని చేయకండి..
ABN , Publish Date - Mar 18 , 2024 | 08:38 PM
Snake Handling Tips: ఈ భూ గ్రహం మీద ఉన్న కోట్లాది జీవుల్లో పాము(Snakes) కూడా ఒకటి. భూమిపై అనేక రకాల, జాతుల పాములు ఉన్నాయి. వాటి పరిమాణం కూడా భిన్నంగా ఉంటాయి. కొన్ని పాములు అత్యంత విషపూరితం(Poison) అయితే.. మరికొన్ని పాములు విష రహితమైనవి ఉంటాయి. వీటితో ఎలాంటి ప్రాణ నష్టం ఉండదు. కానీ, దాదాపు పాములు మాత్రం...
Snake Handling Tips: ఈ భూ గ్రహం మీద ఉన్న కోట్లాది జీవుల్లో పాము(Snakes) కూడా ఒకటి. భూమిపై అనేక రకాల, జాతుల పాములు ఉన్నాయి. వాటి పరిమాణం కూడా భిన్నంగా ఉంటాయి. కొన్ని పాములు అత్యంత విషపూరితం(Poison) అయితే.. మరికొన్ని పాములు విష రహితమైనవి ఉంటాయి. వీటితో ఎలాంటి ప్రాణ నష్టం ఉండదు. కానీ, దాదాపు పాములు మాత్రం విషపూరితమైనవే ఉంటాయి. అందుకే.. పాము కనిపిస్తే చాలు ప్రజలు హడలిపోతుంటారు. అయితే, పాములు సాధారణంగా అటవీ(Forest) ప్రాంతం, చెట్ల పొదల్లో సంచరిస్తుంటాయి. కానీ, ఇప్పుడు అభివృద్ధి పేరుతో కాంక్రీట్ జంగిల్ విస్తరిస్తుండటంతో.. పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇళ్లలోకి ప్రవేశించి.. ప్రజలను హడలెత్తిస్తున్నాయి. టాయిలెట్ సీట్లు, బూట్ల లోపల, సోఫాల కింద, బెడ్స్ కింద, ఇలా తనకు భద్రతగా భావించిన చోట పాములు దూరిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రజలు పాములను చూసినప్పుడు భయంతో హడలిపోతారు. పాము నుంచి తమను తాము రక్షించుకోవడానికి పారిపోవడం గానీ.. పామును కొట్టడం గానీ చేస్తుంటారు. అయితే, పామును కొట్టడం, దానిని తరిమేందుకు ప్రయత్నించడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక్కోసారి ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తుందని చెబుతున్నారు.
పాములను ఎలా డీల్ చేయాలి..
స్నేక్ క్యాచర్స్, నిపుణుల ప్రకారం.. ఎవరికైనా పాము కంటపడినా, సమీపించినా కంగారు పడకుండా నిదానంగా ఉండటమే ఉత్తమమైన మార్గం అని సూచిస్తున్నారు. పాము వైపు పరుగెత్తడం గానీ, పామును కొట్టేందుకు ప్రయత్నించడం గానీ చేయొద్దు. దాని దారిలో దానిని వదిలేయడం ఉత్తమం. పాములకు ఒక గుణం ఉంది. అవి మనుషుల వద్దకు రావడానికి ఇష్టపడవు. వాటిని ఇబ్బంది పెట్టకపోతే.. వాటి దారిన అవి వెళ్లిపోతాయి. అలా కాకుండా.. పాములకు ప్రమాదం తలపెట్టినా, తమకు ముప్పు పొంచి ఉందని పాములు గ్రహించినా అవి వెంటనే దాడి/కాటు వేస్తాయి.
ఈ తప్పు అస్సలు చేయొద్దు..
మరో కీలకమైన విషయం ఏంటంటే.. ఒకవేళ పాము ఇంట్లోకి వస్తే హడావుడి చేయొద్దు. పామును బెంబేలెత్తించొద్దు. అది ప్రశాంతంగా ఉండే విధంగా అక్కడి వాతావరణ సృష్టించాలి. దానిని టెన్షన్ పెడితే.. ఆ తరువాత అది మిమ్మల్ని టెన్షన్ పెడుతుంది. దాని కదలికలను గమనిస్తూనే.. మీరు టెన్షన్ పడకుండా ఉండాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. పామును తమంతట తాముగా పట్టుకోవడానికి ప్రయత్నించొద్దు. పాములను పట్టుకోవడంలో అనుభవం ఉన్న వారినే పిలిచి, వారి సహాయం తీసుకోవాలి. తద్వారా పాము వల్ల ఎవరికీ హానీ ఉండదు. పాము కూడా సురక్షితంగా ఉంటుంది.