Share News

Viral: డోర్ హ్యాండిల్‌‌కు చుట్టుకున్న పాము.. తలుపు తీయగానే.. షాకింగ్ వీడియో

ABN , Publish Date - May 14 , 2024 | 09:33 PM

డోర్ హ్యాండిల్‌కు చుట్టుకుని ఉన్న ఓ పాము తలుపు తెరిచిన వ్యక్తిని అకస్మాత్తుగా కాటేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: డోర్ హ్యాండిల్‌‌కు చుట్టుకున్న పాము.. తలుపు తీయగానే.. షాకింగ్ వీడియో

ఇంటర్నెట్ డెస్క్: అత్యంత ప్రమాదకరమైన జంతువుల్లో పాములు ముందుంటాయని చెప్పక తప్పదు. మూలమూల్లో నిశ్శబ్దంగా దాక్కుని ఉండే పాములు కళ్లుమూసి తెరిచే లోపే కాటేస్తాయి. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం వెలుగు చూశాయి. తాజాగా అలాంటి ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

అమెరికాలో ఈ ఘటన వెలుగు చూసింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ పాము ఇంటి బయటివైపు డోర్ హ్యాండిల్‌కు చుట్టుకుని పడుకుంది. ఇది తెలియని వ్యక్తి ఇంటి తలుపు తెరుచుకుని బయటకు వచ్చే క్రమంలో అక్కడే ఉన్న పాము అతడి చేయిపై వేగంగా కాటేస్తుంది. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించని అతడు ఒక్కసారిగా షాకైపోయాడు. ‘‘దేవుడా.. పాము ఇక్కడ ఉందేంటి’’ అంటూ నొప్పితో బాధపడుతూ అతడు షాకైపోయాడు. అయితే, వీడియో కేవలం 14 పసెకెన్లే ఉండటంతో ఆ తరువాత ఏం జరిగిందనేది తెలియరాలేదు (Snake wraps itself around door handle, attacks man in scary video from US).

Viral: మనిషి రక్తానికి రెండు చుక్కల పాము విషం కలపగానే.. షాకింగ్ వీడియో!


వీడియో చూసిన జనాలు మాత్రం షాకైపోతున్నారు. ఇది నిజంగా అతడికి పెద్ద షాకే అని కామెంట్ చేశారు. కాగా, ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలో దాదాపు ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ప్రపంచంలో మూడో అత్యంత విషపూరితమైన పాము ఓ మూడేళ్ల బాలుడి గదిలోని కప్‌బోర్డులో దాక్కుంది. అదృష్టవశాత్తూ ఆ పామును బాలుడి తల్లి కనిపెట్టడంతో పెను ప్రమాదం తప్పింది. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Read Viral and Telugu News

Updated Date - May 14 , 2024 | 09:33 PM