Share News

Viral Video: నడిరోడ్డుపై తల్లిదండ్రులను చెప్పుతో కొట్టిన కొడుకు.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే..

ABN , Publish Date - Sep 08 , 2024 | 08:10 PM

మనకు జన్మనిచ్చి, పెంచి పోషించి వృద్ధిలోకి తీసుకొచ్చేది తల్లిదండ్రులే. వారు లేకపోతే ఎవరికీ జీవతమే ఉండదు. అలాంటి తల్లిదండ్రులను దేవుళ్లతో సమానంగా పూజించాలి. అయితే ప్రస్తుత తరంలో తల్లిదండ్రులకు చాలా మంది కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు.

Viral Video: నడిరోడ్డుపై తల్లిదండ్రులను చెప్పుతో కొట్టిన కొడుకు.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే..
Srinagar Villages

మనకు జన్మనిచ్చి, పెంచి పోషించి వృద్ధిలోకి తీసుకొచ్చేది తల్లిదండ్రులే (Parents). వారు లేకపోతే ఎవరికీ జీవితమే ఉండదు. అలాంటి తల్లిదండ్రులను దేవుళ్లతో సమానంగా పూజించాలి. అయితే ప్రస్తుత తరంలో తల్లిదండ్రులకు చాలా మంది కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను హీనంగా చూసే పిల్లలు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కొడుకు (Son) తన తల్లిదండ్రులపై కిరాతకంగా దాడికి తెగబడ్డాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది (Viral Video).


శ్రీనగర్‌ (Srinagar)లో ఈ దుర్ఘటన జరిగింది. @pzshakir6 అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. శ్రీనగర్ వీధుల్లో మహ్మద్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులపై దాడికి తెగబడ్డాడు. తన కాలికి వేసుకున్న చెప్పు తీసి తండ్రిని, తల్లిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. తమ స్వంత కొడుకు దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ వృద్ధులు ప్రయత్నించారు. ఇంట్లో నుంచి తల్లిదండ్రులను వెళ్లగొట్టడమే కాకుండా వారిపై దాడికి తెగబడ్డ మహ్మద్‌ను స్థానికులు వారించేందుకు ప్రయత్నించారు. వారితో కూడా మహ్మద్ వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన మొత్తాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఈ వీడియో వైరల్‌గా మారింది. దాడికి గురైన వారి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడు మహ్మద్‌ను అరెస్ట్ చేశారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ``ఇది ఎంత హృదయ విదారకం``, ``ఇంతకంటే ఘోరం ఉండదు``, ``ఎంత క్రూరత్వం``, ``వేగంగా దిగజారిపోతున్న పరిస్థితులకు ఇది దృశ్యరూపం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పాకిస్తాన్‌లోనే ఇలాంటివి సాధ్యమేమో.. కూతురి తలపై సీసీటీవీ అమర్చిన వ్యక్తి.. ఎందుకంటే..


Viral Video: పాపం.. దొంగకు టైం కలిసి రాలేదు.. తుపాకీ గురిపెట్టి బైక్ చోరీకి యత్నం.. చివరకు ఏం జరిగిందో చూస్తే నవ్వాపుకోలేరు..


Viral Video: కాళ్లు లేకపోతేనేం.. ఈమె ధైర్యం, పట్టుదల ముందు ఎవరు సరిపోతారు.. ఆమె డ్యాన్స్ చూడండి..


Viral Video: ఆహా.. ఈ కుర్రాడి ట్యాలెంట్‌కు అవాక్కవ్వాల్సిందే.. అమ్మాయిలా ఎలా డ్యాన్స్ చేశాడో చూడండి..


Picture Puzzle: మీ కళ్లకు స్పెషల్ టెస్ట్.. ఈ రెండు ఫొటోలోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనుక్కోండి...


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 17 , 2024 | 01:34 PM