Share News

Viral Video: అయ్యో.. స్పైడర్ మ్యాన్‌కు ఇలాంటి పరిస్థితా?.. రైల్వే స్టేషన్ ముందు ఎందుకు అడుక్కుంటున్నాడంటే..

ABN , Publish Date - Sep 25 , 2024 | 12:21 PM

స్పైడర్ మ్యాన్ అంటే వీరాధివీరుడు. మానవ మాత్రులకు సాధ్యం కాని ఎన్నో ఫీట్లు చేసి అందరినీ కాపాడుతుంటాడు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటాడు. అలాంటిది స్పైడర్ మ్యానే కష్టాల్లో పడితే ఎలా ఉంటుంది. రోడ్డు పక్కన కూర్చుని బిచ్చం ఎత్తుకుంటే పరిస్థితి ఏంటి?

Viral Video: అయ్యో.. స్పైడర్ మ్యాన్‌కు ఇలాంటి పరిస్థితా?.. రైల్వే స్టేషన్ ముందు ఎందుకు అడుక్కుంటున్నాడంటే..
spide man

స్పైడర్ మ్యాన్ (Spider-Man) అంటే వీరాధివీరుడు. మానవ మాత్రులకు సాధ్యం కాని ఎన్నో ఫీట్లు చేసి అందరినీ కాపాడుతుంటాడు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటాడు. అలాంటిది స్పైడర్ మ్యానే కష్టాల్లో పడితే ఎలా ఉంటుంది. రోడ్డు పక్కన కూర్చుని బిచ్చం (Spider-Man begging) ఎత్తుకుంటే పరిస్థితి ఏంటి? ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే నవ్వు రాక తప్పదు. సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయేందుకు ఓ వ్యక్తి చేసిన స్టంట్ చాలా మంది నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


పిల్లలకు ఎంతో ఇష్టమైన స్పైడర్‌ మ్యాన్‌ వేషంలో ఉన్న యువకుడు ఓ రైల్వే స్టేషన్ బయట నేలపై కూర్చుని భిక్షాటన చేస్తున్నాడు. అందరికీ సహాయం చేసే స్పైడర్ మ్యాన్ తానే స్వయంగా సామాన్యుల సహాయం అడుక్కుంటున్నాడు. ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ (Kalyan Railway Station) బయట ఈ సీన్ కనిపించింది. ఆ విచిత్ర వేషగాడిని చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 30 లక్షల వ్యూస్ వచ్చాయి. 1.45 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు.


ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ``అయ్యో.. ఇప్పుడు హాలీవుడ్‌ను ఎవరు కాపాడతారు``, ``మన దేశంలో స్పైడర్ మ్యాన్ వాల్యూ సున్నా``, ``టోనీ చనిపోయిన తర్వాత స్పైడర్ మ్యాన్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది``, ``అమెరికాలో ఆర్థిక మాంద్యం ప్రభావం వల్ల స్పైడర్ మ్యాన్ ఇలా అయిపోయాడేమో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: కార్ గ్యారేజ్ ఓపెన్ చేసిన వ్యక్తికి షాక్.. లోపల భారీ ఆకారాన్ని చూసి పరుగులు.. వీడియో వైరల్..


Puzzle: మీ మెదడుకు చిక్కుముడి.. వీటిల్లో ఏ పైప్ ద్వారా బకెట్ నిండుతోందో కనిపెట్టండి..


Viral Video: ఈ ఆటోవాలా తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఆటోలో ఎలాంటి కుర్చీ పెట్టుకున్నాడో చూడండి..


Viral Video: ఐఫోన్ మేనియా ఆ రేంజ్‌లో ఉంది మరి.. ఈ ఐఫోన్ వాటర్ ప్రూఫ్ మాత్రమే కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కూడా..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 25 , 2024 | 12:21 PM