Share News

Sri Lanka Oil: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ శ్రీలంక ఆయిల్ వాడాల్సిందే.. దీన్నెలా తయారుచెయ్యాలంటే..!

ABN , Publish Date - Jul 02 , 2024 | 03:45 PM

శ్రీలంక ప్రజలు సాంప్రదాయ పద్దతిలో తయారుచేసే ఈ ఆయిల్ జుట్టు రాలడాన్ని నియంత్రించడమే కాకుండా జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుంది.

Sri Lanka Oil: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ శ్రీలంక ఆయిల్ వాడాల్సిందే.. దీన్నెలా తయారుచెయ్యాలంటే..!

మారుతున్న వాతావరణం ఆరోగ్యంతో పాటు జుట్టును కూడా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా చెమట ధూళి కారణంగా జుట్టు రాలడం ప్రతి ఒక్కరు ఎదుర్కునే సమస్య. తల దువ్వుతున్నప్పుడు జుట్టు గుప్పిళ్ల కొద్దీ ఊడిపోతూ ఉంటుంది. ఇది చాలామందిలో డిప్రెషన్ కు దారితీస్తుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి చాలా ఉత్పత్తులు వాడి ప్రయోజనం లేక నిరాశ పడుతుంటారు. అలాంటి వారికి మెరుగ్గా ఉపయోగపడేదే శ్రీలంక హెర్బల్ హెయిర్ ఆయిల్. శ్రీలంక ప్రజలు సాంప్రదాయ పద్దతిలో తయారుచేసే ఈ ఆయిల్ జుట్టు రాలడాన్ని నియంత్రించడమే కాకుండా జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుంది. ఈ నూనెను ఎలా తయారు చేయాలో.. దీనికి కావలసిన పదార్థాలేంటో తెలుసుకుంటే..

Papaya: జాగ్రత్త.. బొప్పాయిని ఈ ఆహారాలతో కలిపి అసలు తినకూడదు..!



కావలసిన పదార్థాలు..

కొబ్బరినూనె.. 3 కప్పులు

సన్ ఫ్లవర్ నూనె.. 1 కప్పు

నువ్వుల నూనె.. 1 కప్పు

ఆలివ్ నూనె.. 1 కప్పు

బృంగరాజ్ పొడి.. 2 టీస్పూన్లు

ఉసిరి పొడి.. 2 టీస్పూన్లు

మందార పువ్వు పొడి.. 1 టీస్పూన్

శీకాకాయ పొడి.. 1 టీస్పూన్

కుంకుడు కాయ పొడి.. 1 టీస్పూన్

గోరింటాకులు.. 1 కప్పు

కరివేపాకులు.. గుప్పెడు

Protein Food: ఈ 5 ఆహారాలు తింటూ ఉంటే చాలు.. పోషకాహార లోపం మిమ్మల్ని టచ్ చేయదు..!



తయారువిధానం..

స్టౌ మీద ఇనుప బాణిలి ఉంచి అందులో పైన చెప్పుకున్న నూనెలను అన్నీ వేసి తక్కువ మంట మీద ఉడికించాలి. నూనె వేడి అయ్యాక అందులో పైన చెప్పుకున్న పొడులు, ఆకులు అన్నీ వేసి సన్నని మంట మీద ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 30 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించిన తరువాత స్టౌ ఆప్ చేయాలి. నూనె చల్లారిన తరువాత ఫిల్టర్ చేసి గాజు సీసాలో నిల్వచేసుకోవాలి. ఈ నూనెను అలాగే నేరుగా అప్లై చేయవచ్చు. లేదంటే అప్పటికప్పుడు కొద్ది నూనెను వేడి చేసి గోరువెచ్చగా జుట్టుకు పట్టించవచ్చు.

ఈ నూనెను సన్నని మంట మీద ఉడికించాలి తప్ప పెద్ద మంట మీద ఉంచకూడదు. దీన్ని కనీసం ఒక నెలరోజుల పాటూ కంటిన్యూగా వాడితే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

రోజూ ఏలకుల నీటిని తాగుతుంటే ఏం జరుగుతుందంటే..!

కలోంజి విత్తనాలను తేనెతో కలిపి తింటే జరిగేదేంటి?

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 02 , 2024 | 03:45 PM